శ్రీకృష్ణ జన్మస్థానానికి సీఎం యోగి ఆదిత్యనాథ్

Published : Oct 23, 2024, 05:37 PM IST
శ్రీకృష్ణ జన్మస్థానానికి సీఎం యోగి ఆదిత్యనాథ్

సారాంశం

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మథుర : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలో పర్యటించాారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 26న జన్మాష్టమి సందర్భంగా కూడా ఆయన ఇక్కడ పూజలు నిర్వహించారు.  రెండు రోజుల పర్యటనలో భాగంగా బాంకే బిహారీ దర్శనం కూడా చేసుకున్నారు.

నిన్న (మంగళవారం) మథురకు చేరుకున్న ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు, శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధికారిక కార్యక్రమాల అనంతరం శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించిన సీఎం యోగి శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజ చేసి హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేశవ్ దేవ్, యోగ మాయ, గర్భ గృహం, భాగవత భవన్ లను సందర్శించారు. ఆలయ అధికారులు సీఎంకు శాలువాతో సత్కరించారు. ఆలయంలో భక్తులకు అభివాదం చేస్తూ యోగి ఆదిత్యనాథ్ కొద్దిసేపు గడిపారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ