
మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 397 స్థానాల్లో విజయం సాధించింది. 1,079 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం ఇక్కడ వెల్లడయ్యాయి. ఎన్నికల్లో 75 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 397 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర బీజేపీ తరపున సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 'బాలాసాహెబంచి శివసేన'తో కలిపి బీజేపీ 478 స్థానాలకు చేరుకుంది.
235 గ్రామాల్లో సర్పంచ్ లేదా గ్రామాధ్యక్ష పదవిని గెలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 134 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 110, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) 128, 'బాలాసాహెబంచి శివసేన' 114 సీట్లు గెలుచుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 300 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఓటర్లు ఓట్ల ద్వారా బాలాసాహెబ్‌చాంచి శివసేనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. "ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుండి వైదొలగడానికి.. తాము వేసిన అడుగు సరైనదని నిరూపించబడిందని అన్నారు.'బాల్సాహెబంచి శివసేన', బీజేపీకి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించిందని పేర్కొన్నారు.
ప్రజలు విశ్వాసంతో ఓటు వేశారని ఎన్నికల ఫలితాల్లో అద్దం పడుతుందని సీఎం షిండే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉంటే.. నాగ్‌పూర్‌లో, నాగ్‌పూర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అభ్యర్థి ముక్తా కోకర్డే , ఉపాధ్యక్షుడిగా కుందా రౌత్ సోమవారం ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సభ్యుల ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు.
జిల్లా పరిషత్‌లో మొత్తం 57 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ నాగ్‌పూర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రష్మీ బార్వే తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ రెబల్ ప్రీతమ్ కవ్రేకు, ఉపాధ్యక్షుడిగా నానా కంభలేకు బిజెపి మద్దతు ఇచ్చింది.
నాగ్‌పూర్ కాంగ్రెస్ (రూరల్) అధ్యక్షుడు రాజేంద్ర ములక్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక విజయమని, బీజేపీ ప్రాబల్యం కోల్పోతున్నదని అన్నారు. అకోలా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా సంగీత అధౌ, ఉపాధ్యక్షుడిగా వంచిత్ బహుజన్ అఘాడి (విబిఎ)కి చెందిన సునీల్ ఫట్కర్ సోమవారం ఎన్నికయ్యారు.