న్యాయవ్యవస్థపై మంత్రి కిరణ్‌ రిజిజు  కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Published : Oct 18, 2022, 03:48 AM IST
న్యాయవ్యవస్థపై మంత్రి కిరణ్‌ రిజిజు  కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సారాంశం

 శాసనమండలి, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మన వ్యవస్థకు  మూడు స్తంభాలు ఉన్నాయని, కార్యనిర్వాహక, శాసనమండలి తమ విధుల్లో కట్టుబడి ఉంటాయని, న్యాయవ్యవస్థ వాటిని సంస్కరిస్తున్నదని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  అన్నారు.

జ్యుడీషియల్ యాక్టివిజం: మనదేశ ప్రజాస్వామ్యానికి లెజిస్లేచర్,ఎగ్జిక్యూటివ్,న్యాయవ్యవస్థలు  మూడు స్తంభాలుగా ఉన్నాయనీ, ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేచర్ వారి విధుల్లో కట్టుబడి ఉంటారనీ, న్యాయవ్యవస్థ వాటిరి సరిదిద్దుతుందని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  అన్నారు. కానీ, న్యాయవ్యవస్థ తప్పుదారి పట్టినప్పుడు..దానిని మెరుగుపరచడానికి మార్గం లేదని అన్నారు, ఈ మేరకు సోమవారం అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అలాగే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు మాట్లాడుతూ న్యాయవ్యవస్థను నియంత్రించే మార్గం లేనప్పుడు 'న్యాయ క్రియాశీలత' వంటి పదాలు వాడతారని అన్నారు. చాలా మంది న్యాయమూర్తులు వారి ఇచ్చిన నిర్ణయంలో భాగం కాని కేసులపై వ్యాఖ్యానిస్తారు. న్యాయమూర్తిగా మీకు ఆచరణాత్మక ఇబ్బందులు, ఆర్థిక పరిమితులు తెలియవనీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక విధంగా.. వారి ఆలోచనకు అద్దం పడుతాయని అన్నారు.  లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జ్యుడీషియరీ అనే మూడు స్తంభాలు మనకు ఉన్నాయని... ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేచర్‌లు తమ విధుల్లో కట్టుబడి ఉంటాయని, న్యాయవ్యవస్థ వాటిని సరిచేస్తుందని భావిస్తున్నానని చెప్పారు. అయితే న్యాయవ్యవస్థ తప్పుదారి పట్టినప్పుడు, వాటిని మెరుగుపరచడానికి మనకు మార్గం లేదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ