Madurai train fire: మధురై రైలులో అగ్నిప్రమాదం: అక్రమంగా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న టూర్ ఆపరేటర్ అరెస్ట్

Published : Aug 27, 2023, 12:52 AM IST
Madurai train fire: మధురై రైలులో అగ్నిప్రమాదం: అక్రమంగా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న టూర్ ఆపరేటర్ అరెస్ట్

సారాంశం

Madurai train fire: మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన అద్దె టూరిస్ట్ బోగీలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఉత్తరప్రదేశ్ కు చెందిన తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. మరో 8 మందికి గాయాలయ్యాయనీ, ఉదయం 5.15 గంటలకు ప్రయాణికులు ఉపయోగించిన ఎల్పీజీ సిలిండర్ లీకవడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

Madurai train fire-Tour operator arrested: మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన అద్దె టూరిస్ట్ బోగీలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఉత్తరప్రదేశ్ కు చెందిన తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. మరో 8 మందికి గాయాలయ్యాయనీ, ఉదయం 5.15 గంటలకు ప్రయాణికులు ఉపయోగించిన ఎల్పీజీ సిలిండర్ లీకవడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఆగస్టు 17న లక్నో నుంచి బయలుదేరిన ప్రైవేట్ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆగస్టు 29న తిరిగి రావాల్సిన బోగీలో మంటలు చెలరేగాయి. పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వివిధ రైళ్లకు దీనిని అనుసంధానం చేశారు. మొత్తం 55 మంది టూరిస్టులతో పాటు టూర్ ఆపరేటర్ కు చెందిన ఎనిమిది మంది సహాయక సిబ్బంది బోగీలో ఉన్నారు.

ఇక మదురై రైలులో 9 మంది మృతికి కారణమైన వంటగ్యాస్ సిలిండర్ ను అక్రమంగా తరలిస్తున్న టూర్ ఆపరేటర్ పై ప్రభుత్వ రైల్వే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టూరిస్ట్ బోగీలో వంటగ్యాస్ సిలిండర్ ను టూర్ ఆపరేటర్ అక్రమంగా త‌ర‌లించిన చేసిన కేసులో ఐపీసీ, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద జీఆర్ పీ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్సీటీసీ సహకారంతో దక్షిణ రైల్వే కూడా ప్రాణాలతో ఉన్న ప్రయాణికులను లక్నోకు రప్పించేందుకు విమాన ప్రయాణ ఏర్పాట్లు చేయనుందని స‌మాచారం. 

అవసరమైన అన్ని వైద్య, న్యాయపరమైన లాంఛనాలను అనుసరించి మృతదేహాలను విమానంలో లక్నోకు తరలించేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేసింది. తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే తొమ్మిది మంది యాత్రికులు శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి. బాధితులు గత వారం లక్నో నుంచి ప్రైవేట్ పార్టీ కోచ్ లో తీర్థయాత్రకు బయలుదేరారు, వీరిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ రాజధాని, దాని పరిసర ప్రాంతాలకు చెందినవారని అధికారులు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం