‘‘ నీటి కోసం ఏడ్చి .. నీళ్లలోనే చనిపోయేట్టు చేస్తారు’‘ : చెన్నై కార్పోరేషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

By Siva KodatiFirst Published Nov 9, 2021, 3:36 PM IST
Highlights

చెన్నై నగరపాలక సంస్థపై (chennai municipal corporation) ఆగ్రహం వ్యక్తం చేసింది మద్రాస్ హైకోర్ట్ (madras high court) . చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్ధితి మారకుంటే సుమోటాగా స్వీకరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. 

చెన్నై నగరపాలక సంస్థపై (chennai municipal corporation) ఆగ్రహం వ్యక్తం చేసింది మద్రాస్ హైకోర్ట్ (madras high court) . చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్ధితి మారకుంటే సుమోటాగా స్వీకరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. చెన్నై నగరం ఆరు నెలల పాటు నీటి కోసం ఎడుస్తుంటే మరో ఆరు నెలలు నీటిలో చస్తుందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఈ వరదలతోనైనా పాఠాలు నేర్చుకోవాలని సూచించింది. చెన్నై గ్రేటర్ కార్పోరేషన్‌ .. చెరువుల ఆక్రమణపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. 

మరోవైపు తమిళనాడు (tamilnadu) రాష్ట్రంలో భారీ వర్షాలు (rain alert) కురుస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు తమిళనాడుకు రెడ్ అలర్ట్ ను (red alert) జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మంగళశారం నాడు మధ్యాహ్నం భారత వాతావరణ శాఖ (imd) తాజా బులెటిన్ ను విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.శనివారం నుండి తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని వందలాది కాలనీలు నీటిలోనే మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Heavy Rains కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. 538 గుడిసెలు,నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయని  రాష్ట్ర మంత్రి కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపిందని మంత్రి వివరించారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా tamil nadu,పుదుచ్చేరి తీరాల వెంబడి ఉన్న మత్స్యకారులు ఈ నెల 11 వరకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.

Also Read:తమిళనాడులో భారీ వర్షాలు: ఈ నెల 11 వరకు రెడ్ అలర్ట్‌, భయాందోళనలో ప్రజలు

కాగా... ప్రతిసారి ప్రజలను, ప్రభుత్వాన్ని హెచ్చరించే ..వాతావరణ శాఖ (imd) ఈ నెల 6న చెన్నై వాసులకు ఎలాంటి భారీ వర్ష సూచన చేయలేదు. కాంచీపురం (kanchipuram) , చెంగల్పట్టు (chengalpattu) జిల్లాలకు మాత్రమే రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కానీ మద్రాస్‌లో ఆ రెండు జిల్లాలను మించి 207 మిల్లీమీటర్ల మేర కుండపోత వాన కురిసింది. 2015 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే ప్రథమం. ఈ పరిణామం వాతావరణ శాఖను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

దీనిపై వాతావరణ శాఖ దక్షిణాది విభాగం చీఫ్ బాలచంద్రన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను 'మెసస్కేల్ ఫినామినా' అంటారని తెలిపారు. ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేమని తెలిపారు. పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యత్యాసంతో వర్షపాతం నమోదవడం 'మెసస్కేల్ ఫినామినా' కిందికి వస్తుందని బాలచంద్రన్ పేర్కొన్నారు. రోజువారీ పరిశోధనలో భాగంగా ఈ నెల 6కి సంబంధించి గాలి దిశ, మేఘాల కదలికలను పరిశీలిస్తున్నప్పుడు తమ అంచనాల్లో చెన్నై నగరం లేదన్నారు. అందుకే చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకు మాత్రం భారీ వర్షసూచన ఇచ్చామని బాలచంద్రన్ వెల్లడించారు. కానీ చెన్నై నగరంలో ఊహించని విధంగా కొద్ది గంటల్లోనే కుంభవృష్టి కురిసిందని ఆయన చెప్పారు. 

click me!