తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుండి వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 11 వ తేదీ వరకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నెల 11వ తేదీ వరకు తమిళనాడుకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మంగళశారం నాడు మధ్యాహ్నం భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ను విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.శనివారం నుండి తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని వందలాది కాలనీలు నీటిలోనే మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Heavy Rains కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు.538 గుడిసెలు,నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయని రాష్ట్ర మంత్రి కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపిందని మంత్రి వివరించారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా tamil nadu,పుదుచ్చేరి తీరాల వెంబడి ఉన్న మత్స్యకారులు ఈ నెల 11 వరకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.
also read:తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో పాఠశాలలు బంద్..
భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై నగరంటీ నీటి ఎద్దడిపై Madras High Court చెన్నై కార్పోరేషన్ ను నిలదీసింది. వర్షాల సమయంలో నగరం ముంపునకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవడంలో చెన్నై కార్పోరేషన్ విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆరు మాసాలు నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నాం, మరో ఆరు నెలలు నీటిలోనే చావాలా అని హైకోర్టు ప్రశ్నించింది. పరిస్థితి ఇలానే ఉంటే సుమోటోగా తీసుకొంటామని హైకోర్టు తెలిపింది. తమిళనాడులో కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం Stalin తెలిపారు. అన్నాడిఎంకె ప్రభుత్వ హయంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన ఎస్పీ వేలుమణి కమిషన్ తీసుకొన్నారని సీఎం ఆరోపించారు.చెన్నై నగరంలో వర్షం వస్తే నీరు నిల్వ ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీ నిధులను క గత ప్రభుత్వం ఏం చేసిందో తెలియదన్నారు. వరుసగా మూడు రోజులుగా స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.వేలుమణి నేతృత్వంలోని మున్సిఫల్ శాఖ కమీషన్ తీసుకొందన్నారు.
ఈశాన్య రుతుపవనాలకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం డీఎంకె సర్కార్ విఫలమైందని మాజీ సీఎం, అన్నాడిఎంకె కో ఆర్డినేటర్ పళనిస్వామి విమర్శించారు. ప్రణాళిక లోపం వల్లే నగరంలో నీటి ఎద్దడి ఏర్పడిందని ఆయన విమర్శించారు. చెన్నైలోని కోడంబాక్కం, వెస్ట్ మాంబలం, కెకె నగర్ లలో పర్యటించిన సరుకులను మాజీ సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.తాను సీఎంగా ఉన్న సమయంలో అత్యాధునిక పరికరాలతో చెన్నై నగరం నీట మునగకుండా అడ్డుకొన్నామని ఆయన గుర్తు చేశారు.భారీ వర్షాల కారణంగా ఇవాళ కూడా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.