Omicron Effect: జనవరి 5 వరకు 144సెక్షన్ అమలు.. యోగి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Published : Dec 08, 2021, 12:44 PM IST
Omicron Effect: జనవరి 5 వరకు 144సెక్షన్ అమలు.. యోగి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

సారాంశం

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కొత్త వేరియంట్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షాలు విధించింది. ఈ క్ర‌మంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 144సెక్షన్‌ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. జనవరి 5, 2022 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటుంది.  

Omicron Effect: ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలను చావుదెబ్బ కొట్టేలా ఒమిక్రాన్ విస్త‌రిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలువ‌డిన ఈ వేరియంట్ రెండు వారాల వ్య‌వ‌ధిలోనే 50పైగా దేశాల్లో విస్త‌రించింది. ఈ వేరియంట్  డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని  వైద్య నిపుణల హెచ్చరిస్తున్నారు.

మ‌రో వైపు .. క‌రోనా మ‌రోసారి విజృంభిస్తోంది. గ‌త నాలుగైదు నెల‌లుగా సైలెంట్ గా ఉన్నా.. ఈ వైర‌స్ స్లో పాయిజ‌న్ లా విస్త‌రిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి త‌గ్గువే ఉన్నా... ఫిబ్రవరి క‌ల్లా.. థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందన్న  వైద్య నిపుణులు హెచ్చరిస్తోన్నారు. దీంతో దేశం మ‌రోసారి పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తమ‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా.. వ్యాక్సినేష‌న్ ను వేగ వంతం చేస్తోన్నాయి. థర్డ్ వేవ్ ..  ఫోర్త్ వేవ్ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా .. ఎదుర్కొడానికి సన్నద్ధం ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను సూచిస్తోంది. 

Read Also: https://telugu.asianetnews.com/national/with-omicron-third-wave-projected-to-hit-india-by-feb-but-may-be-milder-than-second-says-iit-scientist-r3s7gq

కరోనా ఫ‌స్ట్, సెకండ్ వేవ్ ల‌తో దేశ ప్ర‌జానీకం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఈ క్ర‌మంలో అన్ని రంగాలు దెబ్బ‌తిన్నాయి. ఇప్ప‌డిప్పుడే క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. ప‌రిస్థితులు దాదాపు సాధార‌ణ స్థాయికి వ‌చ్చాయి. అనే తరుణంలో ఒమిక్రాన్ విజృంభ‌న భ‌యాందోళ‌న క‌లుగ చేస్తోంది. ఈ క్ర‌మంలో యూపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న క్రమంలో యోగి సర్కార్  రాష్ట్ర రాజ‌ధాని లక్నోలో 144సెక్షన్‌ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. జనవరి 5, 2022 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటుంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ త‌ప్ప‌ని స‌రి చేసింది. ఏదైనా కార్యక్రమం ఉంటే..  వంద మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని నిర్ణ‌యించింది.  

Read Also: https://telugu.asianetnews.com/national/pm-narendra-modi-warns-bjp-mps-absent-and-irregular-parliament-session-r3r1jt  

క్రిస్మస్, డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుక‌ల్లో కరోనా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని హెచ్చ‌రించింది. త‌ప్పని స‌రిగా.. సోష‌ల్ డిస్టెస్ పాటించాల‌ని ప్రభుత్వం తెలిపింది. జన సాంద్ర‌త ఎక్కువగా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందనీ, సైబర్ క్రైమ్ సెల్ కూడా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిశితంగా గమనిస్తుంది. సోష‌ల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై,  పుకార్లు వ్యాప్తి చేసే వారిపై  కఠిన చర్యలు తీసుకోమ‌ని హెచ్చిరించారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్