రెండో తరగతి వరకు పిల్లలకు హోం వర్క్ ఇవ్వొద్దు

First Published May 30, 2018, 3:01 PM IST
Highlights

పిల్లల హోంవర్క్ పై హైకోర్టు ఆగ్రహం

రెండో తరగతి వరకు పిల్లలకు హోం వర్క్ ఇవ్వకూడదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. స్కూల్‌ బ్యాగుల బరువుపై, చిన్నారి విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘విద్యార్థులు వెయిట్ లిఫ్టర్లు కాదు.. స్కూల్‌ బ్యాగులు లోడ్‌ కంటెయినర్లు కావని’ జస్టిస్‌ కిరుబకరన్‌ పేర్కొన్నారు. విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలకు సూచించారు. సీబీఎస్‌ఈ విద్యార్థులకు రెండో తరగతి వరకు హోం వర్క్‌ ఇవ్వొద్దని సూచించింది. విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల బరువుకు సంబంధించి పాలసీని వెంటనే రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. బ్యాగు బరువు విద్యార్థి బరువులో పది శాతం కంటే ఎక్కువ ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.

‘నో-హోం వర్క్’ నిబంధనను పాఠశాలలు పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సీబీఎస్‌ఈ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీలను ఆదేశించింది. అలాగే ప్రభుత్వం సూచించని‌ పుస్తకాల వాడకాన్ని నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించాలని కోర్టు తెలిపింది.

click me!