ఆ ఊరు తీరే వేరు.. గ్రామ సర్పంచ్ పదవికి వేలంపాట.. ఎక్కువ పాడిన వారే సర్పంచ్

Published : Dec 16, 2021, 02:23 PM IST
ఆ ఊరు తీరే వేరు.. గ్రామ సర్పంచ్ పదవికి వేలంపాట.. ఎక్కువ పాడిన వారే సర్పంచ్

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని ఆ ఊరులో వినూత్న రీతిలో సర్పంచ్‌ను ఎన్నుకుంటున్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవం కాకుండా ఏకంగా వేలంపాటే పాడి ఏకగ్రీవం చేస్తున్నారు. వేలంపాటులో ఎక్కువ బిడ్ వేసిన వారే పంచాయతీ ఎన్నికల్లో పోటీగా నిలబడతారు. ఆయనకు పోటీగా మరెవరూ నిలబడరు. దీంతో వారు వేలంపాట పాడి సర్పంచ్‌ను ఎన్నుకుంటున్నారు. ఈ ప్రక్రియ ద్వారా తాము మందు, డబ్బు పంపిణీ, ప్రలోభాలను అరికడుతున్నామనే వాదనలు కొందరు చేస్తున్నారు. వేలంపాటలో వచ్చిన సొమ్మును ఏం చేస్తున్నామనే విషయాన్ని వెల్లడించలేదు.

భోపాల్: ఒక ఊరి సర్పంచ్‌(Sarpanch)గా బాధ్యతలు చేపట్టాలంటే.. అక్కడ పంచాయతీ ఎన్నికలు(Panchayat Elections) జరగాలి. అందులో పోటీ చేయాలి. నామినేషన్ వేసి గెలిస్తే సర్పంచ్‌గా అధికారాన్ని చేపట్టవచ్చు. బరిలో నిలిచిన వారిల్లోకెల్లా మెజార్టీ ఓట్లు సాధించాలి. లేదంటే ఏకగ్రీవమైనా కావాలి. అంటే.. ఎన్నికల బరిలో ఒకరే నామినేషన్ వేస్తే.. పోటీ ఎవరూ రాకుంటే.. ఆయన ఏకగ్రీవం(Unanimous)గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటిస్తారు. కానీ, మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఓ ఊరిలో విచిత్ర ఆచారం అమలు అవుతున్నది. అక్కడ సర్పంచ్‌ ఏకగ్రీవమే అవుతున్నాడు. కానీ, ఎన్నికల్లో కాదు.. వేలంపాటలో.. ! అశోక్ నగర్ జిల్లాలోని భతౌలీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాడు. గ్రామస్తులు ఆ ‘నూతన సర్పంచ్’కు శుభాకాంక్షలు తెలిపారు.

భతౌలీ గ్రామంలోని ఓ దేవాలయంలో సర్పంచ్ పదవికి వేలంపాట జరిగింది. ఈ పదవికి బేస్ ప్రైస్‌గా రూ. 21 లక్షలు నిర్ధారించారు. దీంతో రూ. 21 లక్షలతో వేలంపాట మొదలైంది. చివరకు ఇది రూ. 43 లక్షల వరకు వెళ్లింది.  సౌభాగ్ సింగ్ యాదవ్ అత్యధికంగా రూ. 43 లక్షల వేలంపాట పాడాడు. ఆ తర్వాత ఎవరూ అంతకు మించి పాడలేదు. దీంతో నూతన సర్పంచ్‌గా సౌభాగ్ సింగ్ యాదవ్‌ను ఖరారు చేశారు. ఆయనకు పూల మాలలు వేసి అభినందనలు తెలిపారు.

Also Read: మ్యాచ్ మధ్యలో కిందపడ్డట్టు నటించి.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి..

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో మధ్యప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు వేలంలో గెలిచిన సౌభాగ్ సింగ్ యాదవ్ నామినేషన్ వేస్తారు. కానీ, ఆయనకు పోటీగా ఇంకెవరూ నామినేషన్ వేయరు. అది వీరి కండీషన్. ఎన్నికల్లోపు సౌభాగ్ సింగ్ యాదవ్ రూ. 43 లక్షలు డిపాజిట్ చేయాలి. ఆయన ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయకుంటే.. ఆయన కంటే తక్కువగా పాడిన రెండో అత్యధిక పాటగాడు సర్పంచ్‌గా పోటీ లేకుండా బరిలో నిలుస్తాడు అని ఆ గ్రామ కమిటీలోని ఓ సభ్యుడు తెలిపాడు.

కాగా, స్థానిక అధికారులు ఈ వేలంపాటును కొట్టిపారేశారు. తాము ఈ వేలాన్ని ధ్రువీకరించబోమని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ కోసం దస్త్రాలను సమగ్రంగా నింపి సమర్పించాల్సిందేనని వివరించారు. సర్పంచ్ పదవి కోసం వారి నుంచి సరైన ఫామ్స్ రావాలని అన్నారు. అవి వ్యాలిడ్ పత్రాలైతేనే సర్పంచ్‌ను ఎన్నుకుంటామని తెలిపారు. ఎవరైనా సర్పంచ్ పదవి కోసం పోటీ చేయవచ్చునని అన్నారు. ఈ పత్రాలు సమర్పించే వారిలో ఇప్పుడు అత్యధికంగా బిడ్ వేసిన వ్యక్తి కూడా ఉండవచ్చునని చెప్పారు

Also Read: ఎన్నికల కోసం పెళ్లి.. మహిళా రిజర్వేషన్ దక్కించుకోవడానికి.. !!

మధ్యప్రదేశ్‌లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది. రిజర్వేషన్ రొటేషన్ రూల్స్‌ను శివరాజ్ సింగ్ చౌహాన్ తుంగలో తొక్కిందని ఆరోపించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో రిజర్వేషన్, డీలిమిటేషన్ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తాజా ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా మార్పులు చేయాలనే రాజ్యాంగ నిబంధనను ఈ ఆర్డినెన్స్ ధిక్కరిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్