తండ్రి ఫోన్ కు బాయ్‌ఫ్రెండ్ మేసేజ్: ఆత్మహత్యకు పాల్పడిన అక్కా చెల్లెళ్లు

Published : Aug 12, 2020, 12:05 PM IST
తండ్రి ఫోన్ కు బాయ్‌ఫ్రెండ్ మేసేజ్: ఆత్మహత్యకు పాల్పడిన అక్కా చెల్లెళ్లు

సారాంశం

ప్రేమ వ్యవహారం తెలిసిందని ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

భోపాల్:  ప్రేమ వ్యవహారం తెలిసిందని ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఆత్మహత్య చేసుకొన్నవారిలో ఒకరు మైనర్ గా పోలీసులు తెలిపారు.  రాష్ట్రంలోని సీయోని జిల్లాలోని  కొండ్ర గ్రామంలో జరిగింది. మృతుల్లో ఒకరికి 16, మరొకరికి 18 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు చెప్పారు.

ఈ ఇద్దరిలో ఒకరి బాయ్ ఫ్రెండ్ ఓ బాలిక తండ్రిక ఫోన్ కు మేసేజ్ పంపాడు. దీంతో వారిద్దరూ భయందోళనలకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

తమ ప్రేమ వ్యవహరం కుటుంబసభ్యులకు తెలిసిందనే భయంతో అక్కాచెల్లెళ్లు సోమవారం నాడు సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లారు. 
అయితే వీరిద్దరి కోసం కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.

మంగళవారం  నాడు ఉదయం గ్రామానికి సమీపంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?