ప్రైవేటు బస్సులో మంటలు.. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం

Published : Aug 12, 2020, 09:25 AM IST
ప్రైవేటు బస్సులో మంటలు..  చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం

సారాంశం

మంటలు చెలరేగగానే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దూకేశారు. అయితే.. ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు.

కర్ణాటకలో హోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారితోపాటు.. ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాగా.. ప్రైవేటు బస్సులు బెంగళూరు నుంచి విజయపురకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మంటలు చెలరేగగానే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దూకేశారు. అయితే.. ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా నిద్ర మత్తులో ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.  కాగా.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.   ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu