మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్

sivanagaprasad kodati |  
Published : Nov 28, 2018, 09:03 AM IST
మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్

సారాంశం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, మిజోరంలో ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, మిజోరంలో ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్ జిల్లాలోని లంజీ, పరస్వాద, బైహర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.

మిగిలిన స్థానాలకు యధావిథిగా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5, 04, 95,251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక 40 స్థానాలున్న మిజోరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 209 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. 7.7 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.


 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !