వారెవ్వా మేనిఫెస్టో: 50 లక్షల ఉద్యోగాలు, రూ.5వేలు నిరుద్యోగ భృతి

By Nagaraju TFirst Published Nov 27, 2018, 3:35 PM IST
Highlights

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయా పార్టీల మేనిఫెస్టోల విడుదలపైనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరిచాయోనని ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అంతేకాదు ఒక పార్టీ మేనిఫెస్టో కు మించి మరో పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడా లేని హామీలతో విడుదల చేస్తోంది. 

జైపూర్‌: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయా పార్టీల మేనిఫెస్టోల విడుదలపైనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరిచాయోనని ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అంతేకాదు ఒక పార్టీ మేనిఫెస్టో కు మించి మరో పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడా లేని హామీలతో విడుదల చేస్తోంది. 

ఆచరణ సాధ్యమా..లేదా అన్న విషయం పక్కన పెడితే ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చామా లేదా అనేది ప్రజెంట్ పొలిటికల్ పార్టీల ఎజెండాగా మారిపోయింది. ఇకపోతే రాజస్థాన్ లో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో వారెవ్వా అనిపిస్తోంది. 

రాజస్థాన్ సీఎం వసుంధర రాజె బీజేపీ మేనిఫెస్టోను మంగళవారం జైపూర్ లోని పార్టీ కార్యాయలంలో విడుదల చేశారు. నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా భారీ తాయిళాలు ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టో నిరుద్యోగులు, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు.  

రాజస్థాన్‌లో సుపరిపాలనకు తాము కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చగలిగామని సీఎం వసుంధర రాజె తెలిపారు. ప్రభుత్వం రూ.80వేల కోట్ల రుణాలు ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బేటీ పడావో పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

రానున్న ఐదేళ్లలో రాజస్థాన్‌లో ప్రైవేటు సెక్టార్‌లో 50లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వసుంధర రాజె హామీ ఇచ్చారు. ఏటా ప్రభుత్వ రంగంలో 30వేల ఉద్యోగాలిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. 21ఏళ్లు పైబడిన అర్హులైన యువతకు నెలకు రూ.5వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. 

రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం  అన్ని రంగాలను అభివృద్ధి బాటలో నడిపించిందన్నారు. ప్రతి గ్రామంలో విద్యుత్‌ సదుపాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం 2013 ఎన్నిక మేనిఫెస్టోలో ఇచ్చిన 665 హామీల్లో 630 హామీలను నెరవేర్చిందని వసుంధరరాజె తెలిపారు.
 

click me!