శ్రీవారి పాదాల వద్ద.. ఈశా అంబానీ వెడ్డింగ్ కార్డ్

Published : Nov 27, 2018, 12:57 PM IST
శ్రీవారి పాదాల వద్ద.. ఈశా అంబానీ వెడ్డింగ్ కార్డ్

సారాంశం

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  మంగళవారం ఉదయం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. 

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  మంగళవారం ఉదయం శ్రీ తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిర్వహించిన అర్చక సేవలో కుమారుడు అనంత్ అంబానీతో కలిసి పాల్గొన్నారు.

ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఈశా అంబానికి ఇటీవల వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె వెడ్డింగ్ కార్డులో తిరుమల ఆలయానికి వచ్చారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు.

అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో  సత్కరించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !