కుక్కను కొట్టవద్దని వారించారు.. భార్య, పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Published : Aug 20, 2023, 07:24 PM IST
కుక్కను కొట్టవద్దని వారించారు.. భార్య, పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పెంపుడు కుక్కను కొట్టవద్దని వారించినందుకే ఆ వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉజ్జయినీ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.  

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్కను కొట్టవద్దని వారించినందుకు ఆ వ్యక్తి తన భార్యను, ఇద్దరు పిల్లలను  కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉజ్జయిన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ దిలీప్ పవార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. దీని మీదే ఆయన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, మద్యానికి బానిస అయ్యాడు. కొన్నాళ్ల క్రితం ఆటో అమ్ముకున్నాడు. ఇంటి వద్దే ఉంటూ మద్యం తాగుతున్నాడు.

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంటకు వారు పెంచుకుంటున్న ఓ కుక్కను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. కుక్కను కొడుతూ ఉంటే ఆ శునకం అరుపులు వేస్తూనే ఉన్నది. ఆ రాత్రి దాని అరుపులు ఇబ్బందికరంగా మారాయి. ఆ కుక్క అరుపులకు నిద్రలేచిన దిలీప్ పవార్ భార్య, ఇద్దరు పిల్లలు ఆయన వద్దకు వచ్చారు.

Also Read: ఆమెకు ప్రాణం పోయడానికి కాసేపు ‘చంపేశారు’.. అరుదైన సర్జరీ విజయవంతం

ఆ కుక్కను వదిలిపెట్టాలని, కొట్టవద్దని భార్య గంగా(40), కొడుకు యోగేంద్ర (14), నేహా (17)లు వారించారు. వారి జోక్యంతో పవార్ కోపోద్రిక్తుడయ్యాడు. కుక్కను కొట్టొద్దని వారించడమే ఆయనకు నచ్చలేదు. కోపంతో కత్తి తీసుకుని భార్యను, కొడుకును, కూతురుని నరికేశాడు. ఆ ముగ్గురూ మరణించారు. ఆ తర్వాత కత్తితో దాడి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే స్పాట్‌కు వచ్చారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం పంపించినట్టు సబ్ డివిజినల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు మహేంద్ర సింగ్ పర్మార్ తెలిపారు. హత్య చేసేటప్పుడు పవార్ మద్యం మత్తులో ఉన్నాడా? లేడా? అనేది ఇప్పుడు స్పష్టంగా చెప్పలేమని వివరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్ కూడా స్పాట్‌కు చేరినట్టు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?