మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం:నలుగురు చిన్నారులు సహా ఏడుగురి మృతి

Published : May 18, 2020, 04:57 PM ISTUpdated : May 18, 2020, 05:14 PM IST
మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం:నలుగురు చిన్నారులు సహా ఏడుగురి మృతి

సారాంశం

: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో పెయింట్ దుకాణంలో అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొంది.  


గ్వాలియర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో పెయింట్ దుకాణంలో అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొంది.

గ్వాలియర్ పట్టణంలోని రోషిణిఘర్ రోడ్డులోని ఇండర్జన్ మార్కెట్ వద్ద ఓ పెయింట్ దుకాణంలో సోమవారం నాడు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెయింట్ దుకాణం కావడంతో అతి వేగంగా మంటలు వ్యాపించాయి. 

also read:అంపన్... సూపర్ సైక్లోన్‌గా మారే ఛాన్స్: ఐఎండీ వార్నింగ్

ఈ షాపుకు పక్కనే ఉన్న ఇళ్లకు కూడ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడ ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు నిర్ధారించారు. 

మృతుల్లో ఆరాధ్య, ఆర్యన్, సుభి గోయల్,ఆర్తి గోయల్, శకుంతల, ప్రియాంక గోయల్,  మధుగోయల్ లు మృతి చెందినట్టుగా  అధికారులు ప్రకటించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ దుకాణంలో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలంలో అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైనదిగా మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..