Madhya Pradesh: విరాళంగా రూ.11 కోట్ల ఆస్తి.. ఆధ్యాత్మిక మార్గంలోకి న‌గ‌ల వ్యాపారి కుటుంబం !

By Mahesh Rajamoni  |  First Published May 19, 2022, 1:23 PM IST

Balaghat: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన నగల వ్యాపారి రాకేశ్‌ సురానా తమ కుటుంబానికి ఉన్న రూ.11 కోట్ల ఆస్తిని గోశాల, మత సంస్థలకు విరాళంగా ఇచ్చారు.  త‌న కుటుంబంతో మొత్తం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. 
 


Madhya Pradesh Jeweler: నిత్యం డబ్బు, న‌గ‌ల‌తో సుఖ‌మ‌య జీవితం గ‌డుపుతున్న ఓ న‌గ‌ల వ్యాపారి కుటుంబం.. ప్ర‌పంచిక‌ సుఖాలను త్వజించి, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న‌దే తడవుగా.. తనకు, కుటుంబానికి చెందిన యావదాస్తులను ఓ గోశాల‌కు.. ఇత‌ర మ‌త సంస్థ‌ల‌కు విరాళంగా అందించింది. త‌న కుటుంబం మొత్తం అధ్యాత్మిక ప్ర‌పంచం వైపు అడుగులు వేస్తున్న‌ద‌ని ఆ న‌గ‌ల వ్యాపారి వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం ఈ విష‌యం వైర‌ల్ గా మారింది. 

ఈ ఘ‌ట‌న‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. బాలాఘాట్ కు చెందిన కోటీశ్వరుడు.. స్వర్ణకారుడు తన భార్య, కొడుకుతో కలిసి ఆధ్యాత్మికత బాటలో పయనించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కుటుంబం మే 22న జైపూర్‌లో ప్ర‌త్యేక ఆధ్యాత్మిక‌ దీక్ష చేపట్టనుంది. ప్రాపంచిక జీవితాన్ని త్యజించి, 11 కోట్ల విలువైన ఆస్తిని గౌశాల, ఇతర మత సంస్థలకు విరాళంగా ఇచ్చింది ఆ కుటుంబం. దీని గురించి న‌గల వ్యాపారి రాకేశ్ సురానా మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్త‌దం కుటుంబం..  తన భార్య లీనా సురానా (36), కుమారుడు అమయ్‌ సురానా (11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని ఆయన వెల్లడించారు. దీని కోసం ఈ నెల (మే 22న)లో  జైపూర్‌లో సన్యాస దీక్ష స్వీకరించనున్నామని తెలిపారు. 

Latest Videos

undefined

అలాగే,  ఆధ్యాత్మిక గురువు గురు మహేంద్ర సాగర్‌, మనీష్ సాగర్ మహారాజ్ త‌మ‌పై ఎంత‌గానో ప్ర‌భావం చూపార‌ని న‌గ‌ల వ్యాపారి కుటుంబం పేర్కొంది. వారి స్ఫూర్తితోనే తాము అధ్యాత్మిక మార్గంలో మిగ‌తా జీవితం కొన‌సాగించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్‌ సురానా వెల్ల‌డించారు. త‌న కుటుంబం గురించి వివ‌రిస్తూ.. త‌న భార్య లీనా సురానా అమెరికాలో చదువుకుంద‌ని తెలిపారు. అలాగే, బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి ప‌ట్టా పొందారు. తన భార్య లీనా సురానా (36) చిన్నతనంలోనే ప్రాపంచిక సుఖాలను త్వజించి, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయాలనే కోరిక‌ను కోరికను వ్యక్తం చేసింద‌న్నారు.  అలాగే, త‌న‌ కొడుకు అమయ్ సురానా కూడా  నాలుగు సంవ‌త్స‌రాల వయసులో ఆధ్యాత్మికం గురించి మాట్లాడేవాడ‌ని తెలిపారు.  అయితే, కుమారుడిది చాలా చిన్నవయసు కావడంతో అతడికి 11 ఏళ్లు వచ్చే వరకూ ఈ కుటుంబం ఎదురుచూసింది.

అలాగే, 2017లో రాకేశ్ సురానా  త‌ల్లి కూడా దీక్ష చేప‌ట్టి.. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్నారు. వీరే కాకుండా రాకేష్ సురానా సోదరి 2008లో దీక్ష చేపట్టారు. ఒకప్పుడు చిన్న దుకాణం నుంచి నగల వ్యాపారం ప్రారంభించిన రాకేష్.. ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.  ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆ కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. ఈ వేడుకకు జనం భారీగా తరలివచ్చారు. ఇదిలావుండ‌గా, రత్లాంకు చెందిన 10 ఏళ్ల ఇషాన్ కొఠారి, రత్లాంకు చెందిన ఇద్దరు కవల సోదరీమణులు తనిష్క, పాలక్‌లు కూడా మే 26న దీక్ష చేపట్టడం గమనార్హం. ఆయన అక్క దీపాలి ఇప్పటికే ఐదేళ్ల క్రితం దీక్ష చేపట్టారు. ముగ్గురు పిల్లలూ ప్రాపంచిక జీవితానికి దూరమై వైరాగ్య మార్గంలో పయనించబోతున్నారు.


 

click me!