హైవే పక్కనే పడుకున్న కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు హఠాన్మరణం, 11 మందికి గాయాలు

By Mahesh KFirst Published May 19, 2022, 12:55 PM IST
Highlights

రోడ్డు రిపేర్ పని చేసి అలసిపోయి ఆ వర్కర్లు రోడ్డు పక్కనే పడుకున్నారు. కానీ, ఆ రాత్రే వారికి కాల రాత్రిగా మారిపోయింది. అధిక వేగంతో నియంత్రణలో లేని ఓ ట్రక్ వేగంగా దూసుకువచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 11 మంది గాయపడ్డారు.

న్యూఢిల్లీ: వారంతా ఎక్స్‌ప్రెస్‌ వే పై రిపేర్ వర్క్ చేస్తున్నారు. ఆ రోజు రిపేర్ వర్క్ చేసి అలసి పోయి రోడ్డు పక్కనే సేద తీరారు. అలా విశ్రాంతి తీసుకుంటూనే నిద్రలోకి జారిపోయారు. కానీ, ఆ నిద్ర వారికి శాశ్వత నిద్ర అవుతుందని భావించలేదు. ఆ ఎక్స్‌ప్రెస్‌ వే పై అదే రోజు రాత్రి ఓ ట్రక్ చాలా వేగంతో ప్రయాణిస్తున్నది. సమీపానికి వచ్చిన తర్వాత వారు కనిపించినా.. లారీని కంట్రోల్ చేయడం సాధ్యపడలేదు. ఆ ట్రక్ అలసిపోయి నిద్రిస్తున్న ఆ కార్మికుల పై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వర్కర్లు హఠాన్మరణం చెందారు. కాగా, మరో 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన హర్యానాలో జాజ్జర్‌లో చోటుచేసుకుంది.

కుండ్లీ మనేసర్ పల్వల్ ఎక్స్‌ప్రెస్ వే పై రిపేర్ వర్క్ జరుగుతున్నది. కొందరు కార్మికులు ఆ రిపేర్ వర్క్ చేస్తున్నారు. ఆ రోజు రిపేర్ వర్క్‌తో వారు చాలా అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని రోడ్డు పక్కనే ఒరిగారు. రోడ్డు పక్కనే గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. అధిక వేగంతో నియంత్రణలో లేని ఓ ట్రక్ వారి వెనుక నుంచి వేగంగా వచ్చింది. రోడ్డు పై పడుకున్న వారిని ఢీకొట్టింది. ఇందులో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. పది మంది క్షతగాత్రులను రోహతక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కాగతా, మరొకరిని బహదుర్‌గడ్‌లోని ట్రామా సెంటర్‌కు పంపారు. 

పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన ముగ్గురి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం బహదూర్‌గడ్‌లోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.

click me!