Nipah Virus: వారం రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు..  

By Rajesh Karampoori  |  First Published Sep 16, 2023, 5:18 AM IST

Nipah Virus: కేర‌ళ‌లో నిఫా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు వచ్చే ఆదివారం వరకు అన్ని విద్యా సంస్థలను వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు , ఇతర విద్యా సంస్థలకు మూసివేత ఆర్డర్ వర్తిస్తుంది.

సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న 1,080 మందిని గుర్తించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 130 మందిని గుర్తించారు. సోకిన వారితో పరిచయం ఉన్నవారిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.  శుక్రవారం మరో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కావడంతో ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. తాజాగా విజృంభిస్తున్న వైరస్‌ సోకి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం.. ధృవీకరించబడిన నిపా రోగుల కాంటాక్ట్ లిస్ట్‌లో 1,080 మంది ఉన్నారు. ఈ రోజు 130 కొత్త చేరికలు ఉన్నాయి. వీరిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు. కోజికోడ్‌తో పాటు. కాంటాక్ట్ లిస్ట్‌లో 29 మంది పొరుగు జిల్లాలకు చెందినవారు, మలప్పురంలో 22 మంది, కన్నూర్, త్రిస్సూర్‌లో ముగ్గురు, వాయనాడ్‌లో ఒకరు ఉన్నారు.
 
హై-రిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ వ్యక్తులు, 122 మంది ఆరోగ్య కార్యకర్తలు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సమాచారం. ఇంతలో, ఆగస్టు 30 న మరణించిన వ్యక్తి యొక్క పరీక్ష ఫలితం శుక్రవారం కూడా పాజిటివ్ గా వచ్చింది. ఈ ఇండెక్స్ కేసు ద్వారా ఇతరులకు సోకినట్లు తెలుస్తోంది.
జ్వరం, వైరస్ సంక్రమణ లక్షణాల కారణంగా రెండు మరణాలు నివేదించబడిన తర్వాత రాష్ట్రం సెప్టెంబర్ 12 న నిపా వైరస్ హెచ్చరికను జారీ చేసింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిపిన పరీక్షలలో మరణాలు నిపా వైరస్ వల్ల సంభవించినట్లు నిర్ధారించబడ్డాయి.

Latest Videos

click me!