డీఎంకె అధినేత కరుణానిధికి స్వల్ప అస్వస్థత: పలువురి పరామర్శ

First Published Jul 27, 2018, 11:36 AM IST
Highlights

డీఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని  వైద్యులు ప్రకటించారు.  శుక్రవారం నాడు వైద్యులు  కరుణానిధి ఆరోగ్యంపై  హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసి వెంటనే పలువురు ప్రముఖులు కరుణానిధి ఇంటికి చేరుకొంటున్నారు.


చెన్నై: డీఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని  వైద్యులు ప్రకటించారు.  శుక్రవారం నాడు వైద్యులు  కరుణానిధి ఆరోగ్యంపై  హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసి వెంటనే పలువురు ప్రముఖులు కరుణానిధి ఇంటికి చేరుకొంటున్నారు.

కరుణానిధి మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయనకు ఆయన నివాసంలోనే  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో కూడ కరుణానిధి బాధపడుతున్నారని వైద్యులు ప్రకటించారు.  అయితే కరుణానిధి ఆరోగ్యంపై  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కరుణానిధి కుటుంబసభ్యులు తప్పుబట్టారు. కరుణానిధి అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు.

ఇదిలా ఉంటే కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని తెలిసిన వెంటనే  డిప్యూటీ సీఎం పళనిస్వామితో పాటు పలువురు మంత్రులు కూడ  కరుణానిధి ఇంటికి చేరుకొని కటుంబసభ్యులను పరామర్శించారు.  ఎండీఎంకే అధినేత వైగో, సినీ నటుడు కమల్‌హాసన్  తదితరులు  కూడ  కరుణానిధి కుటుంబసభ్యులను పరామర్శించారు.

కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని  తెలిసిన  వెంటనే పెద్ద ఎత్తున గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి చేరుకొంటున్నారు.అయితే కరుణానిధిని చూసేందుకు మాత్రం వైద్యులు సందర్శకులను అనుమతించవద్దని కుటుంబసభ్యులను కోరారు. కరుణానిధి ఆరోగ్యంపై వదంతలును నమ్మకూడదని కుటుంబసభ్యులు పార్టీ కార్యకర్తలకు సూచించారు.

click me!