
Lunar Eclipse 2022: భారత దేశ సనాతన ధర్మంలో సూర్యగ్రహణానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. చంద్రగ్రహణానికి కూడా అంతే.. ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే నెలలో సంభవించనున్నది. సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 అనంతరం చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే.. ఈ నెల 16 న ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనున్నది.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు మాత్రమే జరగనున్నాయి. అందులో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పాడనున్నది. అయితే ఈ సంవత్సరం సంభవించనున్న చంద్రగ్రహణాలు రెండూ సంపూర్ణమైనవి. ఈ గ్రహణం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కనిపించబోతోంది. అయితే ఈ చంద్ర గ్రహణాల ప్రభావం భారతదేశంలో తక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఏయే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంటే..
చంద్రునికి భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్య, చంద్ర, భూమి సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడు.. సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఎప్పుడు ఏర్పడనున్నదంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..2022లో మొదటి చంద్రగ్రహణం మే 16న, రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మొదటి చంద్రగ్రహణం.. 16 మే 2022న ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉండనుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖం మే 16న పూర్ణిమ జరుపుకుంటారు.
ఏఏ ప్రదేశాల్లో కనిపించనున్నదంటే..
2022 మే 16న సంభవించే తొలి చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మనదేశంలో లేదు.. కనుక ఈ గ్రహణ సమయాన్ని సూతకాలంగా పరిగణించరు.
సూతక్ కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందటే..?
చంద్రగ్రహణం యొక్క సూతక కాలం గ్రహణానికి 09 గంటల ముందు ప్రారంభమవుతుంది. అయితే, చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో మాత్రమే సూతక్ కాలం చెల్లుతుంది. చంద్రగ్రహణం కనిపించని దేశంలో చంద్రగ్రహణం చెల్లదు. సూతక్ కాలం మే 15వ తేదీ రాత్రి 10.02 గంటల నుంచి సూతకాల కాలం ప్రారంభం కాగా.. చంద్రగ్రహణం ముగియడంతో సూతకాల కాలం ముగుస్తుంది.
చేయవలసినవి.. చేయకూడనివి
చంద్రగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఈ ఖగోళ అద్భుతం చూడటానికి టెలిస్కోప్, బైనాక్యులర్ లేదా అద్దాలు ఉపయోగించాలి. గ్రహణ సమయంలో భోజనం చేయడం మంచిది కాదని భావిస్తార. అంతేకాదు, తులసి ఆకులను ఆహార పదార్థాలలో, ముఖ్యంగా పాలతో చేసిన వాటిలో ఉంచాలని సలహా ఇస్తారు. గ్రహణ కాలంలో అధిక గురుత్వాకర్షణ శక్తి కారణంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడకూడదు, ఇది వారి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. గ్రహణం సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించడం మానుకోండి ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, కత్తులు, ఫోర్క్ మరే ఇతర కోణాల మరియు పదునైన సాధనాలను ఉపయోగించవద్దు. చంద్రగ్రహణం తర్వాత అన్నదానం, వస్త్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. గ్రహణ కాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఎలాంటి అరిష్టమైనా దూరం చేసుకోవచ్చు.