రేపు చంద్రగ్రహణం: ఇండియాలో ఏ టైమ్ లో ఎక్కడ కనిపిస్తుందంటే...

Published : Nov 29, 2020, 11:10 AM ISTUpdated : Nov 29, 2020, 11:26 AM IST
రేపు చంద్రగ్రహణం: ఇండియాలో ఏ టైమ్ లో ఎక్కడ కనిపిస్తుందంటే...

సారాంశం

ఈ ఏడాది చివరి సంపూర్ణ చంద్రగ్రహణం రేపు ఏర్పడుతోంది. కార్తిక పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సభవిస్తోంది. దీంతో ఈ చంద్రగ్రహణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

న్యూఢిల్లీ:  ఈ ఏడాది చివరి సంపూర్ణ చంద్రగ్రహణం రేపు నవంబర్ 30వ తేదీన చోటు చేసుకుంటోంది. 2020లో ఇది నాలుగవ ఉపఛ్చాయ. ఈ చంద్రగ్రహణం కార్తిక పౌర్ణమి రోజు ఏర్పడుతోంది. ఈ ఏాడాది మూడు చంద్రగ్రహణాలు జనవరి 10, జూన్ 5, జులై 4 తేదీల్లో సంభవించాయి. 

ఈ చంద్రగ్రహణం సాయంత్రం 1.04 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.22 గంటలకు పూర్తవుతుంది. గతంలో సంభవించిన మూడు చంద్రగ్రహణాల కన్నా ఇది ఎక్కువ సమయం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వృషభ రాశిపై, రోహిణి నక్షత్రంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. అన్ని రాశులపై కూడా దీని ప్రభావం ఉంటుంది.

సూతక సమయంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందని, అందువల్ల మంత్రోచ్ఛారణలు చేయాలని, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు. ఉపచ్ఛాయ గ్రహణం కావడం వల్ల సూతక ప్రబావం ఉంటుందని చెబుతున్నారు. 

భారత్ లో చాలా చోట్ల ఈ చంద్రగ్రహణం చూసే అవకాశాలు లేవు. పగటి ఏర్పడి, సాయంత్రంలోగా అది ముగుస్తుంది. అయితే, అర్థరాత్రి మాత్రం బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చూడవచ్చు. ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో దీన్ని చూడవచ్చు. అయితే ఆకాశం నిర్మలంగా ఉంటే మాత్రమే కనిపిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?