ఐఈడి బ్లాస్టులతో రెచ్చిపోయిన మావోలు... సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మృతి

Arun Kumar P   | Asianet News
Published : Nov 29, 2020, 08:55 AM ISTUpdated : Nov 29, 2020, 08:57 AM IST
ఐఈడి బ్లాస్టులతో రెచ్చిపోయిన మావోలు... సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మృతి

సారాంశం

భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడ్డారు మావోయిస్టులు. 

చత్తీస్‌గడ్: సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు. భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడ్డారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ  సీఆర్పీఎఫ్ అధికారి మృతి చెందారు.

మావోయిస్ట్ దాడిపై బస్తర్ ఐజీ సురేందర్ మాట్లాడుతూ...  గాయపడిన జవాన్లందరిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో రాయ్ పూర్ కు తరలించామన్నారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఓ అసిస్టెంట్ కమాండర్ మృతిచెందినట్లు తెలిపారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారని... వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఐజీ. 

ఇటీవలే ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా అడవుల్లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలతో పోలీసులకు చిక్కాడు. మావోల నుండి ఏకే 47 గన్ తో పాటు మరికొన్ని మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 
 


 

PREV
click me!

Recommended Stories

జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu
Relationship : ఏవండోయ్ పెళ్లాలు.. మీ మొగుళ్లను ఇలా పిలుచారో విడాకులే...!