లుథియానా సెషన్స్ కోర్టులో పేలుడు.. బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్.. !

By SumaBala BukkaFirst Published Dec 25, 2021, 7:11 AM IST
Highlights

మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్ లో జైలు నుంచి విదుడలయ్యాడని తెలుస్తోంది. గగన్ దీప్ ది పంజాబ్ లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్ లైన్ లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. 

చండీగఢ్ : పంజాబ్ లోని Ludhiana జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం bomb blasts  ఘటనలో మరణించిన వ్యక్తిని former police head conistable గగన్ దీప్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. 

మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్ లో జైలు నుంచి విదుడలయ్యాడని తెలుస్తోంది. గగన్ దీప్ ది పంజాబ్ లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్ లైన్ లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. 

కాగా, పంజాబ్ లోని లుథియానా జిల్లా కోర్టు సముదాయంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తే బాంబును అమర్చినట్లు శుక్రవారం పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సంఘటనా స్థలంలో ఫోన్, సిమ్ కార్డును గుర్తించిన పోలీసులు దానిమీద దర్యాప్తు చేస్తున్నారు. 

రాజస్థాన్‌: ఇండో పాక్ బోర్డర్‌‌లో కుప్పకూలిన మిగ్‌ 21 ఫైటర్ జెట్ .. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

సదరు వ్యక్తి కోర్టు రెండో అంతస్తులోని వాష్ రూంలో ఐఈడీని అమర్చుతుండగా అది ఒక్కసారిగా పేలిపోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి అక్కడి నీటి పైపు పగిలిందని, దీంతో బాంబులోని ముఖ్య భాగాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయని తెలిపాయి. పేలుడు కోసం ఆర్డీఎక్స్ కు ఉపయోగించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే బాంబు పెట్టిన వ్యక్తి ఎవరనేది మొదట కనిపెట్టలేకపోయాదు. పేలుడు జరిగిన ప్రాంతంలో ధ్వంసమైన ఓ ఫోన్, సిమ్ కార్డును గుర్తించారు. వాటి ఆధారంగా ఆ వ్యక్తి వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు. 

గ్యాంగ్ స్టర్ సాయంతో పేలుడుకు కుట్ర..
ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు దీని వెనుక ఉగ్రవాద సంస్థ బబర్ ఖస్లా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారమిచ్చాయి. స్థానిక గ్యాంగ్ స్టర్ అయిన హర్వీందర్ సింగ్ సాయంతో ఈ ముఠా పేలుడుకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

click me!