మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష..!

By telugu news teamFirst Published Oct 6, 2021, 9:45 AM IST
Highlights

బాలిక తల్లి ఫిర్యాదుతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందిదతుడిని రిమాండ్ కు తరలించారు.
 

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు  విధించారు. యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సనత్ నగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నవీన్ అలియాస్ సాలియా(29) ఓ ప్రైవేట్ ఉద్యోగి.

2013 నవంబర్ 23న తనకు పరిచయం ఉన్న ఓ కుటుంబంలో బాలిక(12) ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందిదతుడిని రిమాండ్ కు తరలించారు.

కేసు విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్. తిరుపతి మంగళవారం తుది తీర్పు వెల్లడించారు. నిందితుడు బాధిత బాలికకు రూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం.

కాగా.. మరో ఘటనలోనూ ఓ వ్యక్తిని న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లికి నిరాకరించారనే కోపంతో ఓ కుటుంబంలోని ఏడాది బాలుడిని హత్య చేశాడు. దీంతో  న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు, జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ వాసి రాతుల్ సాయికియ(28) ఓ పాఠశాలలో గార్డుగా పనిచేసేవాడు. అదే బస్తీలో ఉంటూ గార్డుగా పనిచేసే మనిత్ బ్రిజ్య కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు.

మనిత్ ఇంటికివెళ్లి అతడి ఏడాది వయసు ఆదిత్యను దుకాణానికి తీసుకువెళ్లి చాక్లెట్లు తినిపించేవాడు. ఈ క్రమంలో మనిత్ భార్య చెల్లెలు అర్చనను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు.  కక్ష పెంచుకున్న రాతుల్ పథకం ప్రకారం ఆ ఇంట్లోని మైనర్ బాలుడిని దారుణంగా హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో.. అతనికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

click me!