
తమిళనాడు : పెంపుడు జంతువులు యజమానికి విశ్వాసంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఆ మూగజీవాలు తమ యజమాని పట్ల చూపించే ప్రేమకు వెలకట్టలేం. యజమాని కనిపించకపోతే నిద్రాహారాలు మాని ఎదురుచూసే ఘటనలు ఎన్నో వింటాం. అలాంటి ఓ హృదయాన్ని మెలిపెట్టే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. అక్కడ అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అయితే మృతిచెందిన వ్యక్తితో పాటు అతడి పెంపుడు శనకం కూడా ఆసుపత్రికి వచ్చింది.
యజమాని మృతి చెందడంతో.. అది తెలియని ఆ శూనకం మూడు నెలలుగా తన యజమాని కోసం నిరీక్షిస్తూ ఆసుపత్రి బయటే ఎదురుచూస్తోంది.ఈ ఘటన తమిళనాడులోని సేలంలో ఉన్న మోహన్ కుమార్ మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో చూసిన వారందరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఆస్పత్రిలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి గుండెపోటుతో జాయిన్ అయి.. చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.
వందకు పైగా కత్తిపోట్లు.. యువకుడి దారుణ హత్య, పొదల్లో మృతదేహం.. ఏం జరిగింది..?
ఆ సమయంలో అతనితోపాటు అతని పెంపుడు కుక్క కూడా ఆసుపత్రికి వచ్చింది. అతను మృతి చెందిన తర్వాత.. ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే, ఆ పెంపుడు కుక్కను ఎవరు గమనించలేదు. మృతదేహాన్ని తీసుకువెళ్లిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, ఆ శునకం మాత్రం యజమాని కోసం ఎదురుచూస్తూ.. మూడు నెలలుగా అక్కడే ఉంది. ఆస్పత్రిలో విధుల్లో ఉన్న సిబ్బంది దాన్ని చూసి ఎన్నిసార్లు అక్కడి నుంచి తోలేసినా.. మళ్లీ మళ్లీ వస్తోంది. దీంతో దాని పరిస్థితి అర్థం చేసుకున్న భద్రతా సిబ్బంది ఆహారం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, పెంపుడు కుక్కకంటే మనిషి ప్రాణాలు తక్కువగా కనిపించాయి.. అతనికి.. దానిమీది ప్రేమ.. అతడిని రాక్షసుడిని చేసింది. విచక్షణ మరిచిపోయి హంతకుడిగా మారేలా చేసింది. తన పెంపుడు కుక్కకి ఆహారం పెట్టడం విషయంలో ఆలస్యం చేసాడనే కోపంతో ఓ యువకుడు తనకు వరుసకు సోదరుడు అయ్యే బంధువును కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన కేరళలోని పాలక్కడ్ లో నిరుడు నవంబర్ లో చోటు చేసుకుంది. కాగా నిందితుడు హాకీంను ఆ తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హకీం ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. హాకీంతో పాటు అతని బంధువు అర్షద్(21) కూడా అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కుక్కకి ఆహారం అందించే విషయంలో ఆలస్యం చేశాడని అతనిపై హకీమ్ దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అర్షద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.