నాటు నాటు స్టెప్పులు ఆ హీరోలు ఎప్పుడో వేశారా..?

Published : Mar 16, 2023, 11:25 AM IST
  నాటు నాటు స్టెప్పులు  ఆ హీరోలు ఎప్పుడో  వేశారా..?

సారాంశం

ఒకేసారి ఇద్దరూ కాళ్లు కదిలించారు. వారిద్దరూ అలా సింక్ లో డ్యాన్స్ వేయడానికి చాలానే శ్రమించారు. అయితే...  తాజాగా ట్విట్టర్ లో ఓ పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది.

తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఇండియన్‌ సినిమా హిస్టరీగా నిలిచింది. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల్లో ఇండియాకి రెండు ఆస్కార్లు రావడం ఓ విశేషమైతే, తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్ రావడం మరో విశేషం. దాదాపు 95ఏళ్ల కల నేటితో నిజమైంది. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ దక్కింది. ఈ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ అందుకున్నారు. 

 

ఈ సినిమాలో పాట ఎంత హైలెట్ అయ్యిందో... ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు మరింత హైలెట్ అయ్యాయని చెప్పొచ్చు. ఆ పాటలో హీరోలు ఇద్దరూ సింక్ లో స్టెప్పులు వేస్తారు. ఒకేసారి ఇద్దరూ కాళ్లు కదిలించారు. వారిద్దరూ అలా సింక్ లో డ్యాన్స్ వేయడానికి చాలానే శ్రమించారు. అయితే...  తాజాగా ట్విట్టర్ లో ఓ పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో...

 హాస్యనటులు లారెల్, హార్డీలు డ్యాన్స్ చేశారు. అందులో.. వారు నాటు నాటు వంటి స్టెప్పులు చేయడం చూడవచ్చు. నిజానికి సేమ్ ఒకేలా ఉండవు లే కానీ... కొంచెం చూడటానికి అలా అనిపిస్తోంది. దీంతో... లారెల్ , హార్డీ ప్రపంచానికి నాటు నాటు నేర్పారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు

 ఆంగ్లేయుడు స్టాన్ లారెల్ , అమెరికన్ ఒలివర్ హార్డీ 1920ల నుండి 1950ల వరకు అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటులు. వీరిద్దరూ కలిసి చేసిన స్కిట్లు చాలా హిట్ అయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works