సెకండ్ ఫ్లోర్‌లో సరసాలు: చూసిందని మహిళను దారుణంగా చంపిన ప్రేమ జంట

Siva Kodati |  
Published : Nov 27, 2019, 01:32 PM IST
సెకండ్ ఫ్లోర్‌లో సరసాలు: చూసిందని మహిళను దారుణంగా చంపిన ప్రేమ జంట

సారాంశం

గుట్టుగా సాగుతున్న ప్రేమ విషయం ఎక్కడ బయటికి తెలుస్తుందోనని ప్రేమికులు భయపడుతుండటం సహజం. ఇదే భయంతో ఓ ప్రేమ జంట మహిళను హత్య చేసింది.

గుట్టుగా సాగుతున్న ప్రేమ విషయం ఎక్కడ బయటికి తెలుస్తుందోనని ప్రేమికులు భయపడుతుండటం సహజం. ఇదే భయంతో ఓ ప్రేమ జంట మహిళను హత్య చేసింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్, పణ్ణైక్కాడు ప్రాంతానికి చెందిన కేశవన్, మహిళ భార్యభర్తలు.

వీరి మధ్య మనస్పర్థల కారణంగా మూడేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. కుమార్తె సైతం కేశవన్ వద్దే ఉంటోంది. అతని భార్య చెన్నైలో మురుగన్ అనే వ్యక్తి ఇంట్లో పని చేసేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. మురుగన్‌తో సహజీవనం చేస్తూ ఆమె అతని ఇంట్లోనే ఉంటోంది.

Also read:సినిమా చూసిందని.. భార్యను హత్య చేసిన భర్త

సదరు వివాహిత అప్పుడప్పుడు కొడైకెనాల్‌లోని మురుగన్ ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై ఆమె తల్లి దాండిక్కుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

పోలీసుల విచారణలో ఈ నెల 21న మృతురాలి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఆమె బంధువు కుమార్తె ఉన్నట్లు తెలిసింది. ఆ బాలిక 11వ తరగతి చదువుతోంది. ఆమెను ప్రశ్నించిన పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కలిగింది. తమదైన శైలిలో విచారణ జరపడంతో ఆ మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించింది.

తాను ఓ యువకుడిని ప్రేమించానని, దిండిక్కల్‌లోని ఓ పాఠశాలలో కలిసి చదువుకుంటున్నామని తెలిపింది. తామిద్దరం ఏకాంతంగా గడిపేందుకు మహిళ ఇంటిని వినియోగించుకునే వాళ్లమని వెల్లడించింది.

ఈ నెల 21న ఇంట్లోని రెండో అంతస్తులో తాను ప్రియుడితో కలిసి ఉన్నానని అది చూసిన ఆమె తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించిందని చెప్పింది. భయంతో ఆమె గొంతుకు దుప్పట్టా బిగించి హత్య చేసినట్లు బాలిక వివరించింది.

Also Read:క్రైమ్ రౌండప్: ప్రియుడితో ఉండగా చూసిందని బిడ్డ హత్య, భార్య వీడియోలతో భర్త బెదిరింపులు..మరిన్ని

తన ప్రియుడు దిండిక్కల్ వెళ్లాడని, రాత్రి ఇంట్లో ఉండి.. ఉదయాన్నే మహిళ మృతి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపింది. బాలికపై కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆమె ప్రేమికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu