
Ram Lalla Pran Pratishtha: అయోధ్య రామాలయం ప్రారంభం నేపథ్యంలో దేశంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక అయోధ్యంలో అయితే, రామనామ స్మరణ మారుమోతుతోంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం పెద్ద సంఖ్యలో సాధువులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సూపర్ నేచురల్ సీన్ కనిపించింది. ప్రధాన ద్వారం నుంచి సాధువుల బృందం లోపలికి రావడం ప్రారంభించగానే గేటు పైన కూర్చున్న రామ భక్తుడు హనుమంతుడి రూపంగా భావించే వానరం పూలవర్షం కురిపించడం ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని చూసిన సాధువులు అయోధ్య మొత్తం దద్దరిల్లేలా జై శ్రీరామ్ నినాదంతో హోరెత్తించారు.
అయోధ్యలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం వద్ద ఈ దృశ్యం ఆవిషృతమైంది. సాధువులు ఇక్కడికి రావడం మొదలైనప్పుడు ప్రవేశ ద్వారంపై ఉన్న వానరం పూల వర్షం కురిపించడం ప్రారంభించింది. ఈ అతీంద్రియ దృశ్యాన్ని చూసిన ప్రజలు తమ మనసులో రాముడిని స్మరించుకుని హనుమంతుడి నామస్మరణ చేశారు.
అయోధ్య నిర్మలమైన ఆకాశంతో కూడిన వాతావరణం..
జనవరి 22న అయోధ్యలో వాతావరణం క్లియర్ గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 10 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. విజిబిలిటీ ఉదయం 100 నుండి 400 మీటర్లు ఉంటుంది. అయితే, రోజు గడిచేకొద్దీ ఇది స్పష్టంగా మారుతుంది. రామ్ నగర్ అయోధ్యపై తేలికపాటి పొగమంచు ప్రభావం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాతావరణం క్లియర్ గా ఉండి ప్రకాశవంతమైన సూర్యరశ్మి రానుంది అంటే ప్రతిష్ఠాపన సమయంలో వాతావరణం అడ్డంకి కాబోదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
రంగురంగుల పూలతో మెరిసిపోతున్న ఆయోధ్య రామాలయం.. స్పెషల్ ఫొటోలు