ఉన్నత విద్యతో అధిక జీవిత కాలం.. వృద్ధాప్యమూ నెమ్మదిగానే - కొత్త స్టడీలో ఆసక్తికర విషయాలు..

By Sairam Indur  |  First Published Mar 3, 2024, 10:11 AM IST

మీకు ఎక్కువ కాలం జీవించాలని ఉందా ? తొందరగా ముసలివాళ్లు కాకూడదని భావిస్తున్నారా ? అయితే వెంటనే చదవడం ప్రారంభించండి. ఎందుకంటారా ? ఉన్నత చదువులు అభ్యసించిన వారు ఇతరుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని, తొందరగా వృద్ధాప్యం రాదని కొత్త అధ్యయనం వెల్లడించింది.


ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతులు ఇతరులకన్నా ఎక్కువ కాలం జీవిస్తారట. వృద్ధాప్యం కూడా వారికి నెమ్మదిగా వస్తుందట. ఈ విషయాన్ని ఓ కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది. జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్ లో  శుక్రవారం (మార్చి 1) ప్రచురితమైన అధ్యయనంలో.. ఉన్నత విద్య మరణానికి మరణానికి దూరం చేస్తుందని, వృద్ధాప్యం కూడా వేగంగా రాదని చెప్పింది. ఈ స్టడీ మరెన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

వృద్ధాప్యం, విద్య మధ్య సంబంధం ఉందని చెబుతున్న మొదటి అధ్యయనం ఇదేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎక్కువ కాలం జీవిస్తారని తమకు చాలా కాలంగా తెలుసని న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్శిటీ మెయిల్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ బెల్స్కీ తెలిపారు. ‘‘కానీ అది ఎలా జరుగుతుందో ? విద్య ఆరోగ్యకరంగా ఉండటానికి, ధీర్ఘాయువకు ఎలా దోహదం చేస్తుందో తెలుసుకోవడంలో చాలా సవాళ్లు ఉన్నాయి’’ అని బెల్స్కీ యూనివర్సిటీ వార్తా ప్రకటనలో వెల్లడించారు. 

Latest Videos

ప్రతీ రెండు అదనపు సంవత్సరాల పాఠశాల విద్య 2 శాతం నుండి 3 శాతం వృద్ధాప్య వేగానికి దారితీసిందని ఈ అధ్యయనం పేర్కొంది. మొత్తం మీద మాములు విద్యను అభ్యసించిన వ్యక్తి కంటే, ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి మరణించే అవకాశాలు 10 శాతం తక్కువగా ఉంటుందని తేలింది. 

ఈ అధ్యయనం ఎలా చేశారు. 
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ నుండి సమాచారాన్ని ఉపయోగించారు. ఇది తరతరాలుగా మసాచుసెట్స్ నివాసితుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి 1948 లో ప్రారంభించి, ఇప్పటికీ కొనసాగుతున్న ప్రాజెక్ట్. వృద్ధాప్య రేటును అంచనా వేయడానికి పాల్గొనేవారి నుండి జన్యు డేటాను పరిశీలించారు, వృద్ధాప్యానికి స్పీడోమీటర్ ను పోలిన జన్యు గడియారం పరీక్షను ఉపయోగించారు.

click me!