విపక్షాల నిరసన: లోక్ సభ 2 గంటల వరకు వాయిదా...

By AN TeluguFirst Published Jul 19, 2021, 12:37 PM IST
Highlights

వర్షాకాల సమావేశాలు మొదటి రోజు ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

న్యూఢిల్లీ : ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రధాని నరేంద్ర తన మంత్రివర్గంలో కొత్తగా ఎన్నికైన మంత్రులను ప్రధాని సభకు పరిచయం చేయలేకపోయారు. దీన్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం ప్రతిపక్షాలను కఠినమైన ప్రశ్నలు అడగాలని కోరారు, కాని వాటికి సభలో సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

కొత్తగా చేర్చుకున్న మంత్రులను హౌజ్ కు పరిచయం చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ ప్రతిపక్షాలనుంచి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది దీంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చింది. "దేశంలో  మహిళలు, ఓబిసిలు, రైతుబిడ్డలు మంత్రులుగా మారడం..  కొంతమందికి ఇష్టం లేదు. అందుకే వారిని పరిచయం చేయడాన్ని కూడా అనుమతించడంలేదు" అని ప్రధాని అన్నారు.

వర్షాకాల సమావేశాలు మొదటి రోజు ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

పార్లమెంటు బయట మీడియా సభ్యులకు బ్రీఫింగ్ చేస్తూ పిఎం మోడీ మాట్లాడుతూ, హౌజ్ లో మహమ్మారి కోవిడ్ మీద ప్రధానంగా చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటుందని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తులు ఈ వ్యాధి పోరాటంలో వ్యతిరేకంగా పోరాటంలో ''బాహుబలి'' అవుతారని అన్నారు. "టీకా బాహువుకు తీసుకోవడం వల్ల టీకా తీసుకునే వారు బాహుబలి అవుతారు అని చెప్పుకొచ్చారు. 

నిర్దిష్ట వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెట్టిందనడానికి సంబంధించిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేదా వాస్తవాలు లేవు... అని పెగసాస్ స్పైవేర్ వివాదాన్ని ఖండిస్తూ కేంద్రం తెలిపింది. స్నూపింగ్ కుంభకోణంలో బలమైన రక్షణ కల్పించకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఎన్డిటివికి వర్గాలు తెలిపాయి.

"జాతీయ భద్రతకు ముప్పు ఉంది, నేను ఖచ్చితంగా ఈ సమస్యను హౌజ్ లో లేవనెత్తుతాను" అని లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ ఉదయం ఓ వార్తా సంస్థకు తెలిపారు. 

పెట్రోల్ ధరల పెరుగుదల, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, టీకా పరిష్కారం, ఆర్థిక వృద్ధి క్షీణించడం, ఎమ్‌పిఎల్‌ఎడి నిధుల పునరుద్ధరణ, బలహీనమైన సమాఖ్య నిర్మాణం గురించి చర్చించడానికి తృణమూల్ రెండు సభల్లో ఆరు నోటీసులు సమర్పించింది.

పెగసాస్ స్నూప్‌గేట్ గురించి చర్చించడానికి సిపిఐ రాజ్యసభలో బిజినెస్ నోటీసును నిలిపివేసింది.

పార్లమెంట్ సమావేశాలు : ప్రతిపక్షాలు కఠిన ప్రశ్నలు అడగండి.. కానీ, సమాధానం చెప్పేవరకు... ప్రధాని

పార్లమెంటు అనెక్స్‌లో కోవిడ్‌పై ప్రధాని మోడీ ఉబయసభల ఎంపీల నుద్దేశించి సంయుక్త ప్రసంగం చేయడాన్ని  ప్రతిపక్ష పార్టీలు ఆదివారం అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటు సమావేశాల్లో ఉన్న సమయంలో "బైపాస్" నిబంధనలను ఈ చర్య లక్ష్యంగా పెట్టుకుందని వారు చెప్పారు.

నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో, ప్రధాని మోడీ హౌజ్ నిబంధనల ప్రకారం ఏదైనా అంశంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నొక్కిచెప్పారు, చర్చలు నిర్మాణాత్మకంగా, సానుకూలంగా ఉండాలన్నారు. 

click me!