పార్లమెంట్ సమావేశాలు : ప్రతిపక్షాలు కఠిన ప్రశ్నలు అడగండి.. కానీ, సమాధానం చెప్పేవరకు... ప్రధాని

By AN TeluguFirst Published Jul 19, 2021, 11:57 AM IST
Highlights

"అందరు ఎంపీలు, అన్ని పార్టీలు హౌజ్ లో చాలా కష్టమైన, పదునైన ప్రశ్నలు అడగాలని నేను కోరుకుంటున్నాను. అయితే, వీటికి ప్రభుత్వం సమాధానం ఇచ్చేలా.. ఇచ్చే సమయంలో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేలా చూడాలి’’ అని పిఎం మోడీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మీడియా వ్యక్తులతో అన్నారు.

న్యూ ఢిల్లీ : ప్రతిపక్షాలు కఠినమైన ప్రశ్నలు అడగాలి, అయితే, పార్లమెంటులో వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వాని అనుమతించాలి.. అని వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

"అందరు ఎంపీలు, అన్ని పార్టీలు హౌజ్ లో చాలా కష్టమైన, పదునైన ప్రశ్నలు అడగాలని నేను కోరుకుంటున్నాను. అయితే, వీటికి ప్రభుత్వం సమాధానం ఇచ్చేలా.. ఇచ్చే సమయంలో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేలా చూడాలి’’ అని పిఎం మోడీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మీడియా వ్యక్తులతో అన్నారు.

"ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచుతుంది, ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది. అభివృద్ధి వేగాన్ని మెరుగుపరుస్తుంది" అని ఆయన అన్నారు. ఈ సమావేశాల్లో.. అన్ని అంశాల మీద నిర్మాణాత్మకమైన చర్చలు, డిబైట్లు జరుగుతాయని ప్రభుత్వం ఎదురుచూస్తోందని ప్రధాని నిన్న చెప్పారు.

సభ సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో, ప్రజలకు సంబంధించిన స్నేహపూర్వక సమస్యలను లేవనెత్తడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.

కోవిడ్ పై ప్రభుత్వం తీసుకన్న చర్యలు, సరిహద్దులో చైనా చొరబాట్లు, ఆర్థిక వ్యవస్థ వంటి కీలక అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని భావిస్తున్నారు. దీనివల్ల పార్లమెంటు బయట ఉభయ సభల ఎంపీలతో కోవిడ్ మీద ప్రధాని మోడీ ప్రసంగం దీనివల్ల రిజెక్ట్ అయ్యింది.

నిన్నటి సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన డెరెక్ ఓబ్రెయిన్, ట్వీట్ చేస్తూ  "COVID-19 పై ప్రభుత్వం, ప్రధాని ఇచ్చే ఫాన్సీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను గానీ,  కాన్ఫరెన్స్ రూమ్ లో జరిగే వాటిని కానీ ఎంపీలు కోరుకోవడం లేదు. పార్లమెంటు లో సెషన్‌ ఉంది. హౌజ్ లోని ఫ్లోర్ హౌస్ కి రండి " అన్నారు. 

మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, న్యాయ సంఘం సభ్యులు, ఇతరులతో పాటు 40 మంది భారతీయ జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి పెగసాస్ స్పైవేర్‌ను ఉపయోగించడం మీద ప్రభుత్వం ప్రశ్నల వర్షం ఎదుర్కొబోయే మరో ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. పెగాసస్‌ను విక్రయించే ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది, ఇది "వెటడ్ ప్రభుత్వాలతో" మాత్రమే వ్యవహరిస్తుందని పేర్కొంది.

click me!