"చంపేస్తాం.." : లోక్ సభ మహిళ ఎంపీకి బెదిరింపులు కాల్స్.. రాష్ట్రంలో భయాందోళనలు 

Published : Aug 22, 2023, 05:52 PM IST
"చంపేస్తాం.." : లోక్ సభ మహిళ ఎంపీకి బెదిరింపులు కాల్స్.. రాష్ట్రంలో భయాందోళనలు 

సారాంశం

Navneet Rana: లోక్‌సభ ఎంపీ నవీత్ రాణాకు బెదిరింపులు కాల్ వచ్చింది. నిందితులు ఎంపీని చంపేస్తానని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి.

Navneet Rana: మహారాష్ట్రలో బెదిరింపుల కలకలం చెలారేగింది. అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ.. గుర్తుతెలియని నిందితుడు ఆమె ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. రద్దీగా ఉండే ప్రదేశంలో కత్తితో పొడిచి చంపేస్తానని భయాభంత్రులకు గురిచేశారు. దీంతో ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను వెంటనే పట్టుకుంటామని చెప్పారు. ఎంపీ నవనీత్ రానాకు ..  విఠల్‌రావు అనే వ్యక్తి చంపేస్తానని బెదిరించినట్టు గుర్తించారు. 

అందిన సమాచారం మేరకు ఎంపీ నవనీత్ పర్సనల్ సెక్రటరీ రాణా వినోద్ గుహే రాజాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఏడెనిమిది రోజులుగా నవనీత్ రాణాను చంపేస్తానని విఠల్‌రావు నవాచి అనే వ్యక్తి .. నిత్యం ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు. కత్తితో దాడికి చేస్తానని బెదిరింపులకు గురి చేశాడని, ఇది కాకుండా.. బెదిరింపులకు పాల్పడిన నిందితులు తనని అసభ్య పదజాలంలో దూషించారని ఫిర్యాదులో నవనీత్ రానా పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ రాణా పర్సనల్ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి రాజాపేట పోలీసులు నిందితులపై 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని విచారించడం ప్రారంభించారు. నవనీత్ రాణా ప్రైవేట్ సెక్రటరీ నిందితుడి నంబర్ గురించి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు అతని మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఎంపీ రాణాను బెదిరింపులకు గురి చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌