భారత ఉలేమాలు గతంలో జీవించొద్దు.. తమ పాత ఆలోచనలను సవరించుకోవాలి

Published : Aug 22, 2023, 05:43 PM IST
భారత ఉలేమాలు గతంలో జీవించొద్దు.. తమ పాత ఆలోచనలను సవరించుకోవాలి

సారాంశం

భారత ఉలేమాలు చరిత్రలో కీలక పాత్ర పోషించారనేది నిర్వివాదాంశం. అయితే, వారు చరిత్రలోని గత కాలానికే పరిమితం కావద్దు. తమ ఆలోచనలు సంస్కరించుకుని నేటి సమస్యలను పరిష్కరించడానికి ఉన్ముఖులు కావాలి.  

న్యూఢిల్లీ: భారత ఉలేమాలు ఇప్పటికీ ప్రాసంగికంగా ఉండాలంటే తమ పాత్రను పునర్నిర్వచించుకోవాలి. వారు తమ పాత కాలపు ఆలోచనల నుంచి బయటికి రావాలి. గతకాలపు గొప్పతనాన్ని కొనసాగిస్తూనే అందుకు కొత్త ఆలోచనల స్రవంతిని జోడించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకానీ, పాత తత్వాన్ని వదిలిపెట్టుకోవాలి.

భారత ముస్లిం స్కాలర్లు చరిత్రలో విశేష కృషి చేశారనేది నిస్సందేహం. భారత స్వాతంత్ర సంగ్రామంలోనూ కీలక పాత్ర పోషించారు. అందులో కొందరు ఇప్పటికీ అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ, మెజార్టీ భారత ఉలేమాలు(ముస్లిం రిలీజియస్ స్కాలర్లు) ఇంకా గతంలోనే జీవిస్తున్నారు. కాలం మారింది. అందుకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉన్నది.

గతంలో ఈ స్కాలర్ల ఆధారంగా పాలకులు నిర్ణయాలు తీసుకునేవారు. ఇస్లాం చట్టాలు, విలువల రూపకల్పనలో వీరి పాత్ర అమోఘం. ముస్లిం పాలకుల కాలంలో వీరు చట్టాన్ని నిర్వచించేవారు. కోర్టులను నియంత్రించేవారు. విద్యా వ్యవస్థను నడిపేవారు. అనేక ముస్లిం సామాజిక వ్యవస్థల్లోనూ కీలక పాత్ర పోషించేవారు. అనేక క్రతువుల్లోనూ వీరు పాత్ర ఉండేది. సమాజంలో సామాజిక విలువలను సుస్థిరం చేయడంలోనూ ముఖ్యపాత్ర పోషించారు.

కానీ, ఇది పోస్ట్ మాడ్రన్ వరల్డ్. ఇప్పుడు షరియా చట్టాలు దేశాలను కంట్రోల్ చేయవు. కేవలం ప్రభుత్వ లౌకిక విధానాలే ముఖ్యం. ప్రస్తుత భారత నేపథ్యాన్ని చూసుకుంటే ఉలేమాలు చట్టాన్ని నిర్వచించలేరు. కోర్టులను కంట్రోల్ చేయలేరు. ఇస్లాం న్యాయపరిధి నేడు అసంగతం. ఇప్పుడు మన రాజ్యాంగానికి బయట ఎవరూ ఏ అధికారాన్ని కలిగి ఉండరు. అందుకే భారత ఉలేమాలకు తమ ఆలోచనలను సంస్కరించుకోవడానికి సమయం ఆసన్నమైంది. 

నేడు భారత ఉలేమాలు ముఖ్యంగా మూడు చోట్ల పని చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ కూడా సంస్కరించుకన్న మార్గాలను ఎంచుకోవాలి. ముందుగా విద్యావ్యవస్థ కోసం కృషి చేయాలి. ఇందుకోసం వారు అలీగఢ్ మూవ్‌మెంట్(ఆధునిక) లేదా దియోబంద్ మూవ్‌మెంట్‌(సాంప్రదాయిక)ను కలిపి ఎంచుకోవచ్చు. ఈ రెండు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వీటి సమ్మేళనంతో కొత్త చూపును ఏర్పరుచుకోవాలి. నేడు ముస్లిం విద్యలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులను కేవలం మత అధ్యయనానికే పరిమితం చేయరాదు.

Also Read: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌ను తిరస్కరిస్తే.. అనివార్యంగా సైనిక పాలనను ఆహ్వానించడమే!

ఇది వరకే ఈ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ముస్లిం విద్యార్థులు చెల్లిస్తున్న మూల్యాన్ని ఒకసారి పరిశీలించాలి. ఉనికిలో ఉన్న వ్యవస్థను గౌరవించడం నేర్పాలి. మతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి. మన కాలపు వాస్తవాలపై అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం. ఖలీఫా కలలు కనాల్సిన అవసరం లేదు. ఏ పార్టీపైనా ద్వేషాన్ని పెంచుకోవాల్సిన పని లేదు. ఏ అభ్యర్థి ప్రయోజనకరం అనేది నిర్ణయించుకోవడం ఉత్తమం.

వారు పోషించాల్సిన రెండో ముఖ్య పాత్ర ఏమిటంటే.. ప్రాపంచిక, ఆధ్యాత్మికత మధ్య సంతులనం చేయాల్సి ఉన్నది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్‌డ్‌గా ఉండే విధానాన్ని ఎంచుకోవాలి. సమాజ నైతిక విలువలు, అన్ని మతాల వ్యక్తుల పట్ల సహానుభూతి, సామాజిక సామరస్యం, తోటి పౌరులతో ఘర్షణలు తగ్గించుకనే విలువల ఆధారంగా ముస్లింల ప్రవర్తనను నిర్ణయించాలి. ఇందుకు విరుద్ధంగా ఉండే సాహిత్యాన్ని తుంచేయాలి.

మూడో ప్రాధాన్యత ఏమిటంటే.. మహిళల హక్కుల రక్షించాలి. మహిళళు పురుషులతోపాటుగా పని చేశారు. ప్రజా జీవితంలో పని చేశారు. ప్రసంగాలు విన్నారు. ఉపన్యాసాలు ఇచ్చారు. కవితలు రాశారు. కొన్నిసార్లు యుద్ధాల్లోనూ పాల్గొన్నారు. మదీనాలో మార్కెట్ హెడ్‌గా ఒక మహిళను నియమించారు.

వలసవాదంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ముస్లిం ఉలేమాలు కాలంతోపాటు ప్రయాణించడానికి నిరాకరించారు. గతంపైనే దృష్టిపెట్టారు. వారు ఆధునిక విద్యను వ్యతిరేకించారు. కానీ, దీనికి ఇప్పుడు ముస్లిం సముదాయం మూల్యం చెల్లించుకుంటున్నది.

90 ఏళ్లనాటి కాలం చెల్లిన సాహిత్య సాంగత్యాన్ని భారత ఉలేమాలు వదులుకోవాలి. అవి ఇస్లాంలోని నిజమైన విలువలతో మమేకమై లేవు. అలాగే, ఇప్పటి కాలానికి పని చేయవు. ఏ విద్యావంతురాలైన బాలిక ఆ కాలం చెల్లిన విషయాలను విశ్వసిస్తుంది? కాబట్టి, అలాంటి సాహిత్యపు భాగాలను తొలగించాలి.

ముస్లిం బాలికలు చదువుకోవడానికి ప్రోత్సహించాలి. తద్వార వారు ఉద్యోగం పొంది సోదరీ, సోదరుల భారాన్ని పంచుకోగలుగుతారు. తల్లిదండ్రుల వైద్య ఖర్చులను భరిస్తారు. 

Also Read: కశ్మీరీ టెర్రరిస్టుకు ఆ స్వచ్ఛంద సంస్థపై ఎందుకంత నమ్మకం? తన బిడ్డను అక్కడే పెంచాలని ఆదేశం

గత కాలానికే పరిమితం కాకుండా వర్ధమాన విజయగాధలను ముస్లిం బాల బలికలకు చెప్పాలి. ఇందులో కొందరు మంచి జీవితాలను జీవిస్తున్నారు. ఎంతమంది ఉలేమాలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ముస్లిం విద్యార్థులకు ఆదర్శప్రాయుడైన హీరోగా చూపెట్టారో నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

చివరగా.. ఉలేమాలు ఇత్జిహద్‌ను పాటించాలి. ప్రస్తుత ప్రపంచంలో ఎదురవుతున్న సమస్యలను ఇస్లాంలోని నిపుణుడి ద్వారా హేతుబద్ద సమాధానాలను పొంది పరిష్కరించుకోవాలి. ఈ పద్దతికి ఎంతో స్కోప్ ఉన్నది. దీన్ని సమర్థవంతంగా  పాటిస్తే మన కాలపు ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

ఇస్లాం ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. సౌదీ మద్దతుండే ముస్లిం వరల్డ్ లీగ్, ఇండోనేషియాకు చెందిన నౌహద్‌లాతుల్ ఉలామాలు ఆధునిక ఇస్లాం వైపు వెళ్లుతున్నాయి. వీరు ప్రపంచంలోని మత పెద్దలతో, నాయకులతో సంబంధాలు పెంచుకుంటున్నారు. నాగరికతలో ఘర్షణలు నివారించడానికి ఇదే సరైన మార్గం. భారత ఉలేమాలు కూడా ముందుకు వచ్చి భారత నిర్మాణానికి అనువైన పద్ధతులను ఎంచుకుని సానుకూల మార్పును తీసుకురావాలి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌