లోక్‌సభలో విపక్షాల ఆందోళన: మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా

By narsimha lode  |  First Published Nov 30, 2021, 11:27 AM IST

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి లోక్‌సభలో టీఆర్ఎస్  ఎంపీలు నిరసనకు దిగారు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరక స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.


న్యూఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.Paddy  ధాన్యంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ Trs ఎంపీలు ఆందోళన చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ మంగళవారం నాడు మధ్యాహ్నం  రెండు గంటల వరకు  వాయిదా వేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరో వైపు  పెరిగిన నిత్యావసర ధరలపై Congress నేత అధిర్ రంజన్ చౌధురి వాయిదా తీర్మానం ఇచ్చారు. లఖీంపూర్ ఖేరీ ఘటనపై Cpm  ఎంపీ అరిఫ్ వాయిదా తీర్మానం ఇచ్చారు.Loksabha ప్రారంభమైన వెంటనే విపక్షాలు తమ డిమాండ్లపై  తమ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు వరి ధాన్యం విషయమై ఆందోళన చేశారు. విపక్ష సభ్యుల మధ్యే కొద్దిసేపు సభ నడిచింది.  అయితే విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

పార్లమెంట్ లో టీఆర్ఎస్ నిరసన

Latest Videos

undefined

 మంగళవారం నాడు టీఆర్ఎస్ ఎంపీలు  లోక్ సభలో ఆందోళనకు దిగారు.  వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తన విధానాన్ని ప్రకటించాలని   టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.  ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు. వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు.  వరి ధాన్య సేక‌ర‌ణ‌పై జాతీయ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. స్పీక‌ర్ చైర్‌లో కూర్చున్న ఏ రాజా టీఆర్ఎస్ ఎంపీల‌ను శాంతింపచేసేందుకు ప్ర‌య‌త్నించారు. రాజా ఎంత కోరినా తెలంగాణ ఎంపీలు వెనుదిర‌గ‌లేదు. దీంతో 3 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్ఎస్  ఎంపీలు నిరసనను కొనసాగించారు. ఈ సమయంలో  టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావుకు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్ ఓం బిర్లా.  రాష్ట్రం నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

also read:హైద్రాబాద్‌పై బీజేపీ కుట్రలు: ఎంపీ అరవింద్ విమర్శలకు బాల్క సుమన్ కౌంటర్

గ‌డిచిన 60 రోజుల నుంచి తెలంగాణ రైతులు పండించిన‌ ధాన్యాన్ని కేంద్రం సేక‌రించ‌డంలేదన్నారు. అందుకే మేం స‌భ‌లో ఇలా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తోంద‌న్నారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల‌ని, అప్పుడే తాము చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌న్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం ప్రకటన చేస్తే తాము తమ నిరసనను  విరమిస్తామని నామా నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ సమయంలో  విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగడంతో  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా  లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు.


 

ayjh

click me!