తొమ్మిదేళ్ల బాలిక కడుపులో శిశువు.. ఆమెతోపాటే పెరుగుతూ...

By AN TeluguFirst Published Nov 30, 2021, 11:09 AM IST
Highlights

పుట్టుకతోనే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడే ఆ బాలికతో పాటే కడుపులోని శిశువు సైతం పెరుగుతూ వచ్చిందని వైద్యులు తెలిపారు. బిడ్డ కడుపునొప్పి అని బాధ పడినప్పుడల్లా చిన్నచిన్న ఆసుపత్రుల తో పాటు.. భూతవైద్యులకు చూపించడం చేసేవారు రోష్ని తల్లిదండ్రులు.  చివరకు pain తగ్గకపోవడంతో ముంబైలోని  సీయాన్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టుకతోనే ఓ చిన్నారికి కడుపునొప్పి ఉంది. చిన్నతనంలో అజీర్తి వల్ల అనుకున్న తల్లిదండ్రులు దానికి ఏవో ప్రత్యామ్నాయ చికిత్సలు చేయించారు. పెరుగుతున్న కొద్దీ కడుపునొప్పి బాధపెడుతుంటూ.. స్థానిక వైద్యులకు చూపించినా తగ్గలేదు.. దీంతో అదేదో చేతబడి లాంటిదనుకుని భూతవైద్యులకు కూడా చూపించారు. కానీ ఎంతకీ చిన్నారి కడుపునొప్పి పెరగక పోగా.. వయసుతో పాటు తీవ్రం అవుతూ వచ్చింది. చివరికి అసలు విషయం తెలియంతో.. తల్లిదండ్రులతో పాటు వైద్యులూ షాక్ అయ్యారు.. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్ లోని ఓ గ్రామానికి చెందిన 9యేళ్ల బాలిక పుట్టినప్పుటినుంచి Stomach acheతో బాధపడుతుంది.  ఆమెకు ఇటీవలే Sonography పరీక్షలు నిర్వహించిన వైద్యులు నొప్పికి గల కారణాలు చెప్పగా తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.  ఆమె కడుపులో పెరుగుతున్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు,  కళ్ళు ఉన్న మృత శిశువు అని తేల్చారు. 

మృత శిశువును..
పుట్టుకతోనే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడే ఆ బాలికతో పాటే కడుపులోని శిశువు సైతం పెరుగుతూ వచ్చిందని వైద్యులు తెలిపారు. బిడ్డ కడుపునొప్పి అని బాధ పడినప్పుడల్లా చిన్నచిన్న ఆసుపత్రుల తో పాటు.. భూతవైద్యులకు చూపించడం చేసేవారు రోష్ని తల్లిదండ్రులు.  చివరకు pain తగ్గకపోవడంతో ముంబైలోని  సీయాన్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

బాలిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వైద్యులు  Surgery చేసేందుకు ముందుకు వచ్చారు.  తీవ్రంగా  శ్రమించి..  విజయవంతమయ్యారు.  ఎట్టకేలకు  చిన్నారి  కడుపులోని మృత శిశువును బయటకు తీశారు. ఇటువంటి అరుదైన సందర్భాల్లో బిడ్డ పుట్టే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు తెలిపారు.

యూపీలో దారుణం.. దళిత ప్రభుత్వాధికారి, అతని భార్య గొంతుకోసి చంపిన దుండగులు...

ఇక ఈ పరిస్థితిని మొదట్లోనే కనుగొనవచ్చని శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ పరాస్ కొటారి తెలిపారు. ‘ చిన్నప్పటి నుంచే కడుపునొప్పితో బాధపడుతున్న  బాలికకు మెరుగైన వైద్యం అందించకుండా.. మూఢనమ్మకాల వల్ల చిన్నారి ప్రాణాలను  ప్రమాదంలోకి నెట్టారు’  అని చెప్పారు. ‘ ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం అయింది.  బాలిక తన జీవితాన్ని తోటివారిలాగే కొనసాగించగలుగుతుంది’  అనే డాక్టర్ జోషి స్పష్టం చేశారు.  ఉత్తమమైన పీడియాట్రిక్ బృందం వల్లే ఈ ఆపరేషన్ సాధ్యమైందని తెలిపారు. 

వైద్య చరిత్రలో ఇలాంటి సంఘటలను అరుదుగా జరుగుతుంటాయి. కవలలుగా ఉన్న పిల్లలు తల్లి గర్భంలోనే కలిసిపోవడం, లేదా ఓ శిశువు రూపుదిద్దుకునే క్రమంలోనే మరో శిశువులోకి వెళ్లిపోవడం లాంటి వాటి వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి వాటిని మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాలకు ప్రమాదం ఉండదు. కానీ గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తొమ్మిదేళ్ల చిన్నారి కేసులోనూ ఇదే జరిగిందని, కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ పరిస్థితికి మొదట్లోనే చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంకొన్ని రోజులు ఆలస్యం అయి ఉంటే చిన్నారి ప్రాణాలను చాలా ప్రమాదం వాటిల్లేదని చెబుతున్నారు. 

click me!