Latest Videos

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ ... పోలీసులకే తెలిసే ఈ తతంగమంతా..!!

By Arun Kumar PFirst Published May 24, 2024, 4:45 PM IST
Highlights

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ స్థానిక పోలీసులకు తెలిసే జరిగిందా..? వాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించారా..? అంటే అవుననే సమాధానం పోలీస్ ఉన్నతాధికారుల నుండి వెలువడుతోంది. అందువల్లే స్ధానిక పోలీసులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు. 

Bangalore Rave Party : బెంగళూరులో వెలుగుచూసిన రేవ్ పార్టీ అటు కర్ణాటకలోనే కాదు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాఫిక్ గా మారింది. ఈ పార్టీ జరిగింది కర్ణాటక రాజధానిలో అయినా పాల్గొన్నవారిలో తెలుగువారే ఎక్కువ. కొందరు తెలుగు సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించినట్లు బయటపడింది... మరి ఇంకేమైనా అశ్లీల కార్యకలాపాలు జరిగాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై దుమారం రేగుతుండగా తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీస్ ఉన్నతాధికారులు. 

అయితే ఈ రేవ్ పార్టీపై ముందుగానే స్థానిక పోలీసులకు సమాచారం వుందనే విషయం బయటపడింది. అయినప్పటికి ఈ రేవ్ పార్టీని అడ్డుకోకుండా  నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెబ్బగోడి  పోలీసులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు. హెబ్బగొడి ఏఎస్సై నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్,  కానిస్టేబుల్ దేవరాజులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. అలాగే అనేకల్ ఏఎస్పి మోహన్ కుమార్, ఇన్‌స్పెక్టర్‌ అయ్యన్న యాదవ్‌లకు నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు మెమోలు జారీ చేశారు.

ఇక ఇప్పటికే రేవ్ పార్టీ నిర్వహకుడు వాసును ఏ1, అరుణ్ కుమార్ ను ఏ2, నాగబాబును ఏ3, రణధీర్ బాబు ఏ4, మహ్మద్ అబూబకర్ ఏ5, గోపాల్ రెడ్డి ఏ6 గా కేసులు నమోదయ్యాయి. పార్టీలో పాల్గొన్న 68 మంది యువకులు ఏ7, యువతులను ఏ8 గా చేర్చారు. అయితే పార్టీలో పాల్గొన్న యువతీయువకులు డ్రగ్స్ నిర్దారణ పరీక్షలు చేయ గా 59 మంది యువకులు, 27 మంది యువతులకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.  ఇలా మొత్తం 130 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ కావడంతో వారికి పోలీసులు నోటీసులు జారీ చేసారు.  టాలీవుడ్ సినీతారలు హేమ, ఆషీరాయ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. 


 

click me!