సంఘటితమయ్యే అవకాశాలు కోల్పోయి.. ముస్లిం అస్తిత్వంతో జీవించడం

Published : May 09, 2023, 05:19 PM ISTUpdated : May 09, 2023, 05:20 PM IST
సంఘటితమయ్యే అవకాశాలు కోల్పోయి.. ముస్లిం అస్తిత్వంతో జీవించడం

సారాంశం

దేశ విభజనకు ముందు నుంచే మత అల్లర్లు ఉన్నాయి. దేశ విభజన తర్వాత చాలా మంది ముస్లింలు అభద్రతకు లోనయ్యారు. వారు స్వచ్ఛందంగా దేశంలో ఉండిపోయినా.. ఆ తర్వాత దేశంలోని ఇతర వర్గాలతో కలిసిపోవడంలో తడబడ్డారు. జాతీయతా భావాన్ని పెంపొందించుకోవడానికి పూనుకున్న కొన్ని ముస్లిం సంఘాలు.. వారిని సమాజంతో సంఘటితం చేయడంలో విఫలమయ్యాయి. పలుమార్లు వచ్చిన అవకాశాలను వారు అందిపుచ్చుకోలేకపోయారు.  

ఈ మధ్య ఢిల్లీ రోడ్లపై వెళ్లుతుంటే..కారుపై హిందూ స్టిక్కర్ కనపడం సాధారణమైంది. ఇది కొంత గగుర్పాటుగా అనిపిస్తుంది. ఈ పరిణామం ఎన్నడూ చూడనిది. భారత హిందువులు వారి మత అస్తిత్వాన్ని ఇలా మోసుకెళ్లేవారు కాదు. ఈ పరిణామాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.

హిందువులు వారి మతాన్ని ప్రేమిస్తారు. కానీ, మత అస్తిత్వ స్పృహ ఉండేది కాదు.

దేశ విభజన  తర్వాత భారత ముస్లింలు మైనార్టీలుగా మారారు. అందులోని ‘క్రిమీ లేయర్’ పాకిస్తాన్‌కు వలసవెళ్లింది. ఇష్టపూర్వకంగా, ఎలాంటి బలవంతం లేకుండా మిగిలిన వారు ఇక్కడే ఉండిపోయారు. కొత్తగా ఏర్పడ్డ పాకిస్తాన్‌లోకి కుటుంబం, సోదరులు అంతా తరలివెళ్లితే ఇక్కడే ఉండిపోయిన వారి కథలూ పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. అయితే, ఇక్కడే ఉండిపోయినవారిలో వారి అస్తిత్వం గురించిన ఆందోళన ఉండేది. అందుకే వారు తమ మత గుర్తింపు విషయంలో ఎప్పుడూ ఎరుకతో ఉండేవారు. కొన్ని ముస్లిం సంఘాలు కమ్యూనిటీలో ఇంకిన భయాలను తొలగించి దేశంలో మైనార్టీగా స్వేచ్ఛగా బతికే భరోసాను, ధైర్యాన్ని నూరిపోశాయి.

ముఖ్యంగా జమాత్ ఉలేమా హింద్ ఇలాంటి మంచి పనులు చేసింది. భారత్ అనే ఆలోచనకు, లౌకిక వాస్తవాలతో వారిని మమేకం చేసింది. అదే విధంగా ఇక్కడ ఇండియా కూడా అన్ని వర్గాలకు వివక్షకు తావు లేకుండా సమాన అవకాశాలను ఇచ్చింది.

ఆ సందర్భంలో పైన పేర్కొన్న సంఘాల వంటివి దేశం కోసం పాటుపడాల్సిన గుణాన్ని కమ్యూనిటీలో పెంపొందించింది. దేశం పట్ల ప్రేమగా, బాధ్యతాయుతంగా ఉండాలన్న ఇస్లాం నిబంధనలకు అనుగుణంగా ఈ స్పృహన పెంచాయి. ఇప్పటికీ ముస్లింలు ఈ భావాలను కలిగి ఉన్నారు. వారికి దేశం అన్ని విధాల, అన్ని రంగాల్లో సమాన అవకాశాలను ఇచ్చింది.

అయితే, ఆ గ్రూపులు వారిని జాతీయవాదులుగా తీర్చిదిద్దడానికి ప్రోత్సహించాయి. కానీ, అదే సందర్భంలో హిందువులు, ఇతర సమూహాలతో సంఘటితం చేయడంలో విజయవంతం కాలేకపోయాయి. విభజన పీడ కలలతో అవసరంలేని అభద్రతతో కలెక్టివ్‌గా ఆ కమ్యూనిటీ బాధితురాలిగా మారింది. ఈ స్థితి దీర్ఘకాలం కొనసాగింది. ఇప్పుడు ముస్లిం అస్తిత్వమే వివాదాస్పదంగా మారిపోవడం విషాదం.

ఏ మానవ సంబంధమైనా ఇచ్చిపుచ్చుకోవడాలు, బాంధవ్యాలను పెంచుకోవడంతోనే మనుగడ సాధిస్తుంది. లేదంటే కాలగర్భంలో కలిసిపోతుంది. హిందువులు మంచి ఉదారవాదులుగా ఉన్నప్పుడు వారితో సంబంధాలు పెంచుకోవడంలో ముస్లిం వర్గం ఒక ఆటంకిగా మారింది. విభజన జరిగిన తర్వాత వర్గాల మధ్య సామాజిక సంబంధాలు బలపడాల్సింది. కానీ, అవి అనుకున్న తీరుగా అభివృద్ధి చెందలేకపోయాయి.

దీనికి తోడు మత అల్లర్లు ఈ పరిస్థితులను మరింత జటిలం చేశాయి. దేశ విభజనకు ముందు నుంచే అల్లర్లు ఉన్నాయి. 1893(ముంబయి)లోనూ మత అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా 1921 నుంచి 1940 మధ్య కాలం సంక్లిష్టమైనది. కలకత్తాలో ముహర్రం వేడుకలు జరుగుతుండగా 1926లో అలర్లు జరగ్గా.. దేశ విభజన తర్వాత 1948లో మరోసారి జరిగాయి. 1961 (జబల్‌పూర్), 1969 (అహ్మదాబాద్)లలో పెద్ద అల్లర్లు జరిగాయి.

Also Read: పితృస్వామ్యం, సోదరుల దురాశ.. ఖురాన్ చెబుతున్నా వారసత్వ ఆస్తికి నోచుకోని ముస్లిం మహిళలు

అయితే, 1975లో హిందు, ముస్లింల మధ్య బంధం ఏర్పడటానికి ఒక సదవకాశం వచ్చింది. అది ఎమర్జెన్సీ కాలం. అప్పుడు ఆర్ఎస్ఎస్, జమాత్ ఈ ఇస్లామీ నేతలను కారాగారాల్లో బంధించారు.

ఆర్ఎస్ఎస్, జమాత్ నేతలు కలిసే జైళ్లలో ఉన్నారని, ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం అప్పుడు కలిగిందని మౌలానా మహ్మద్ జాఫార్ (జమాత్ ఈ ఇస్లామీ మాజీ సెక్రెటరీ జనరల్) అన్నారు. కానీ, ఆ తర్వాత సామాజిక సామరస్యత ఏర్పడటానికి ఈ కలయికలు కొత్త బీజం వేయలేకపోయాయి.

మత అల్లర్లు, పరాయీకరణ ముస్లింలను ప్రధానస్రవంతి నుంచి మరింత అట్టడుగుకి పంపించాయి. సంక్షోభాలను అరికట్టడమే ప్రధానంగా మారింది. ఆ కార్చిచ్చు మాత్రం మరింత విస్తరించంది.

అప్పటి రాజకీయ పార్టీలు ముస్లిం సెంటిమెంట్లు, అభ్రదతా భావాలతో లబ్ది పొందాలనే ఎత్తుగడలు వేశాయి. సంతుష్టివాద రాజకీయాలతో వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగా మార్చేసుకున్నాయి. ఇది ఆ కమ్యూనిటీ సృష్టించుకున్న ప్రపంచంలో వారే పరాజితులుగా మారిపోయేలా చేసింది. ప్రధాన స్రవంతి నుంచి ముస్లిం కమ్యూనిటీ దూరం కాకుండా ఆపడంలో రాజకీయ నాయకత్వం విఫలమైంది.

అసమర్థ నాయకత్వం ముస్లింల కళ్లకు గంతలు కట్టింది. ముస్లిం మేధోవర్గం ఆ తప్పులను సరిదిద్దాల్సింది. కానీ, వారు ఆ బాధ్యతను నెరవేర్చలేదు. ముస్లిం దార్శనికుడు సర్ సయ్యద్ అహ్మద్ వంటివారి జ్ఞాపకాలు పలుచబడ్డాయి. ముస్లిం మేధావుల వైఫల్యం.. కమ్యూనిటీని ఒక ఓటు బ్యాంకుగా చూసే ముస్లిం రాజకీయ నేతలకు పురుడు పోసింది.

వారికి విజన్ లేదు. వారి స్వార్థానికి కమ్యూనిటీని రాజకీయాలకు వాడుకుంది. కమ్యూనిటీని పణంగా పెట్టి అధికారంలో ఉండటానికి వెనుకాడలేదు. ఆ నేతలకు ఇప్పుడు గడ్డు కాలం వస్తున్నది. కానీ, వారి వల్ల జరగాల్సిన నష్టం గత ఏడున్నర దశాబ్దాల్లో జరిగిపోయిందనేది చేదు నిజం.

మత పెద్దలు ఇస్లాం మతాన్ని, రాజకీయాలను వేరుగా చూడదని బోధించారు. కానీ, దేశ రాజకీయాల వాస్తవ పరిస్థితులను చూడటంలో ముస్లింలు విఫలమయ్యారు.

ఏ మత అస్తిత్వమైనా ఏకాకిగా ఏర్పడదు. ఇతర వర్గాల సమూహంలోనే సృష్టించబడతాయి. ఒక వేళ భారత్ కేవలం హిందువుల దేశమే అయితే.. ఇప్పుడు ఆ కార్లపై స్టిక్కర్లు కనిపించేవి కావు. ఆ స్టిక్కర్లు మనం కోల్పోయిన అవకాశాలను గుర్తు చేస్తున్నాయి. 

ముస్లింలు ఇప్పుడు చేయవల్సింది.. వాస్తవాలను గ్రహించి ముందుకు నడవడమే. మార్పును స్వీకరించి ముందుకు వెళ్లడం ఇతర వర్గాలను చూసి నేర్చుకోవాలి. సౌదీ అరేబియా, ఇండోనేషియా వంటి దేశాలను చూసి వేగంగా మారుతున్న పరిస్థితులను ఎలా ఒడిసిపట్టుకుంటున్నారనేది గ్రహించాలి.

సరైన నాయకత్వం లేకుంటే ఆ వర్గం వెనుకబడిపోతుంది. అందుకే ఇప్పుడు లౌకిక విలువను పునర్నిర్వచించాల్సి ఉన్న దని ముస్లిం పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. కమ్యూ నిటీ కూడా గతాన్ని పరిశీలించి ఉజ్వల భవిష్య త్తును నిర్మించుకోవాలి.

అందుకే నేటి ముస్లిం నేతలు సృజనాత్మక ఆలోచనలతో ముం  దుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆత్మపరిశీలన చేయడం, కొత్త ప్రణాళికలు వేయడం నేటి అత్యవసరం.

 

(--అతీర్ ఖాన్)

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?