సహజీవనం ఆమోదయోగ్యం కాదు: పంజాబ్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 18, 2021, 11:27 PM IST
Highlights

సహజీవనంపై పంజాబ్‌, హర్యానా ఉమ్మడి హైకోర్టు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
 
పిటిషినర్లు గుల్జా కుమారి (19), గురువిందర్‌ సింగ్‌(22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివసిస్తున్నామని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు. అయితే గుల్జా కుమారి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ.. కోర్టును ఆశ్రయించారు.  

Also Read:ఇద్దరమ్మాయిల మధ్య లవ్: ఇంటి నుండి జంప్, కోర్టుకు

దీనిపై స్పందించిన న్యాయస్థానం .. పిటిషినర్లు దాఖలు చేసిన పిటిషన్‌ ద్వారా సహజీవనానికి తమ ఆమోద ముద్ర కోరుతున్నారని వ్యాఖ్యానించింది. కానీ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదు అని జస్టిస్‌ హెచ్‌ఎస్‌ మదాన్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

click me!