క్యాబ్ డ్రైవర్ ని దోచుకొని.. ముక్కలుగా నరికి...

Published : Feb 05, 2019, 11:23 AM IST
క్యాబ్ డ్రైవర్ ని దోచుకొని.. ముక్కలుగా నరికి...

సారాంశం

ఇక ముందు నుంచి అర్థరాత్రి క్యాబ్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్లు కూడా భయపడే రోజులు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్లకు కూడా రక్షణ లేదని తాజా ఘటనతో తేలిపోయింది.

అర్థరాత్రి క్యాబ్ లో ప్రయాణించాలంటే  చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ తమపై దాడి చేస్తాడేమో.. నగలు, డబ్బులు కాజేస్తాడేమో అని.. ఇక అమ్మాయిలయితే.. తమపై అఘాయిత్యాలు చేస్తారేమో అని కంగారు పడతారు. అయితే.. ఇక ముందు నుంచి అర్థరాత్రి క్యాబ్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్లు కూడా భయపడే రోజులు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్లకు కూడా రక్షణ లేదని తాజా ఘటనతో తేలిపోయింది.

గ్రేటర్ నోయిడాకు చెందిన దంపతులు అర్దరాత్రి ఓ క్యాబ్ ఎక్కి...డ్రైవరును హతమార్చి...మూడు ముక్కలు చేసి కారును స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
 
క్యాబ్ డ్రైవరు రాంగోవింద్  క్యాబ్ ఎవరైనా ఎక్కుతారేమోనని అర్థరాత్రి ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో  ఫర్హాత్ అలీ, సీమాశర్మ అనే దంపతులు వచ్చి ఘజియాబాద్ లోని తమ ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కావాలని ఎక్కారు. క్యాబ్ ఘజియాబాద్ చేరాక టీ తాగి వెళ్లమని డ్రైవరును కోరారు. 

దంపతుల మత్తు మందు కలిపిన టీ ఇవ్వడంతో అది తాగిన క్యాబ్ డ్రైవరు రాంగోవింద్ మత్తులోకి జారుకున్నాడు. అనంతరం తాడును మెడకు బిగించి రాంగోవింద్ ను దంపతులు హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసిన వేర్వేరు చోట్ల డ్రైనేజీలో పడేశారు. అదృశ్యమైన క్యాబ్ డ్రైవర్ రాంగోవింద్ శవమై మూడు ముక్కలుగా లభించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో ఈ దంపతులే ఘాతుకానికి పాల్పడ్డారని తేలింది. వారిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Tamil Nadu Assembly: మిళనాడు అసెంబ్లీలో రచ్చ ఉదయనిధి vs పళనిస్వామి | Asianet News Telugu
CM Vijay Fire Speech in Assembly: సీఎం విజయ్ స్పీచ్ కిదద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet Telugu