టాయ్ లెట్ కోసం.. బస్సులో నుంచి దూకేసిన మహిళ

Published : Feb 05, 2019, 10:32 AM IST
టాయ్ లెట్ కోసం.. బస్సులో నుంచి దూకేసిన మహిళ

సారాంశం

టాయ్ లెట్ కోసం.. ఓ మహిళ ఏకంగా బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం  విరుదునగర్ జిల్లా ఇడయాన్ కుళం ప్రాంతంలో చోటుచేసుకుంది. 

టాయ్ లెట్ కోసం.. ఓ మహిళ ఏకంగా బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం  విరుదునగర్ జిల్లా ఇడయాన్ కుళం ప్రాంతంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇడయాన్ కుళం ప్రాంతానికి చెందిన మహిళ పాండియమ్మాళ్ ఆండిపట్టి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తోంది.  కాగా.. మార్గమధ్యంలో ఆమెకు అత్యవసరంగా యూరిన్ కి వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం బస్సు ఆపాల్సిందిగా బస్సు డ్రైవర్, కండక్టర్లను ఆమె కోరికింది.

అయితే.. ఆమె ఎంత మొత్తుకున్నా.. వాళ్లు మాత్రం కనికరించలేదు. దీంతో.. చేసేదేమీలేక ఆమె కదులుతున్న బస్సులో నుంచి కిందకు దూకేసింది. కదులుతున్న బస్సులో నుంచి దూకడంతో ఆమె తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అక్కడ ప్రాథమికి చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స నిమిత్తం మధురైలోని రాజాజీ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మెల్‌బోర్న్‌ లో మోదీ క్రేజ్ చూసి ఆస్ట్రేలియా ప్రధాని షాక్ | PM Modi in Australia: Melbourne
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia