పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అల్ ఖైదాతో లింకులు - ఎన్ఐఏ

Published : Dec 21, 2022, 01:58 PM IST
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అల్ ఖైదాతో లింకులు - ఎన్ఐఏ

సారాంశం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో లింకులు ఉన్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. తమకు లభించిన ఆధారాల్లో ఈ విషయం స్పష్టమైందని కేరళ కోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. 

చట్టవిరుద్ధమైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. ఈ మేరకు కేరళ కోర్టు ఎదుట బుధవారం ఓ నివేదిక దాఖలు చేసింది. పీఎఫ్‌ఐ నేతలు వివిధ మార్గాల్లో ఉగ్రవాద సంస్థతో టచ్‌లో ఉన్నారని దర్యాప్తు సంస్థ తన నివేదికలో పేర్కొంది.

షెల్టర్ హోమ్ లోని 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఒకరు మైనర్

ఈ నిషేధిత గ్రూపు రహస్య విభాగాన్ని నడుపుతోందని, దానిని వేరే సమయంలో బయటపెట్టాలని ఎన్ఐఏ తెలిపింది. ‘‘ఇటీవలి దాడుల్లో ఎన్ఐఏ కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకుంది. వాటిని స్కానింగ్ చేస్తే పీఎఫ్ఐ నాయకులు అల్ ఖైదాతో టచ్‌లో ఉన్నారని ఏజెన్సీకి తెలిసింది. వారికి రహస్య విభాగం కూడా ఉంది’’ అని ఓ అధికారి తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

ఇతర రాష్ట్రాల లవ్ జిహాద్ వ్య‌తిరేక‌ చట్టాలను అధ్యయనం చేస్తాం: దేవేంద్ర ఫడ్నవీస్

ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో పీఎఫ్ఐ మొత్తం నెట్ వర్క్ ను ఎన్ఐఏ చేధించింది. తరువాత పీఎఫ్ఐని నిషేదించారు. ఆ సంస్థకు చెందిన నాయకులందరినీ అరెస్టు చేశారు. ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐకు ఐఎస్‌ఐఎస్ వంటి గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో 'లింకులు' ఉన్నాయనీ, దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం ఐదేళ్ల పాటు పీఎఫ్ఐని నిషేధించింది.

పీఎఫ్ఐ కి చెందిన ఎనిమిది అసోసియేట్‌లు.. రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ లు సైతం నిషేధిత జాబితాలో చేర్చింది. గత సెప్టెంబరులో ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ఏజెన్సీలు అలాగే పోలీసు బలగాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక దాడులలో 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం