ప్రగతికి 'హిందూ రాజ్యం' ఒక్కటే మార్గం కాదు... యూసీసీపై అమర్త్యసేన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Jul 06, 2023, 12:00 PM IST
ప్రగతికి 'హిందూ రాజ్యం' ఒక్కటే మార్గం కాదు... యూసీసీపై అమర్త్యసేన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Kolkata: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) క‌ష్ట‌మైన అంశమనీ, దాన్ని సరళీకృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నోబెల్ బహుమతి గ్రహీత, ప్ర‌ముఖ‌ ఆర్థికవేత్త అమర్త్యసేన్ పేర్కొన్నారు. హిందూ రాష్ట్ర భావనతో యూసీసీకి కచ్చితంగా సంబంధం ఉందని సేన్ అన్నారు. అయితే, "ప్రగతికి హిందూ రాజ్యం ఒక్కటే మార్గం కాదు. హిందూ మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారని" కూడా ఆయ‌న పేర్కొన్నారు.  

Nobel Laureate Amartya Sen  On UCC: యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు చేస్తున్న ప్రయత్నాలు 'బ్లాఫ్' అని నోబెల్ బహుమతి గ్రహీత, ప్ర‌ముఖ ఆర్థికవేత్త‌ అమర్త్యసేన్ అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ఎవరికి లాభం అని ఆయన ప్రశ్నించారు. విశ్వభారతిలోని తన నివాసంలో ప్రొఫెసర్ సేన్ విలేకరులతో మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ కసరత్తు కచ్చితంగా 'హిందూ రాజ్యం' ఆలోచనతో ముడిపడి ఉందని ఆయన అన్నారు.

తెలివితక్కువ ఆలోచన..

"ఉమ్మడి పౌరస్మృతి అమలులో మరింత జాప్యం జరగకూడదని ఈ రోజు పేపర్లలో చూశాను. ఇంత తెలివితక్కువ పని ఎక్కడి నుంచి వచ్చింది? మనం వేలాది సంవత్సరాలుగా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) లేకుండా ఉన్నాము. భవిష్యత్తులో కూడా అది లేకుండా ఉండవచ్చు" అని అమ‌ర్త్య‌సేన్ చెప్పిన‌ట్టు ది హిందూ నివేదించింది. దేశం పురోభివృద్ధి సాధించడానికి 'హిందూ రాష్ట్రం' ఒక్కటే మార్గం కాదనీ, ఈ ప్రశ్నలను విస్తృత దృక్పథంతో చూడాలని ప్రొఫెసర్ సేన్ అన్నారు. ఖచ్చితంగా హిందూ మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందని కూడా ప్రొఫెసర్ సేన్ అన్నారు. యూసీసీని అమలు చేసే ప్రయత్నాలు ప్రజల మధ్య చాలా వ్యత్యాసాలతో సంక్లిష్టమైన సమస్యను బహిరంగంగా సరళీకృతం చేయడమేనని ఆయన అన్నారు. మతాలు వేరు, నియమాలు-ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ఆ విభేదాలను అధిగమించి మనం ఏకం కావాలని అన్నారు.

ఒబామా వ్యాఖ్యలపై..

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మైనారిటీ హక్కుల విషయంలో భారత్ 'విచ్ఛిన్నం' చేయవచ్చని చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా... దేశంలో వర్గ, మత, లింగ పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవన్నీ సవాలుగా మారే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ఒబామా ప్రస్తావించడం సంతోషంగా ఉందన్నారు. కానీ మాలో చాలా మంది ఈ విషయాన్ని సులభంగా ఎత్తి చూపగలిగారు" అని ఆయన అన్నారు. కాగా, తన ఇంటి 'ప్రతిచి'లో విశ్వభారతి యూనివర్శిటీ విద్యార్థుల బృందాన్ని కలిసిన ఆయన తనను తన పూర్వీకుల ఆస్తి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న విశ్వభారతి యూనివర్సిటీ యాజమాన్యం తీరును ప్రశ్నించారు. తమ వైఖరిని చాలా మంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారో యూనివర్సిటీ అధికారులు తమను తాము ప్రశ్నించుకోవాలని ప్రొఫెసర్ సేన్ అన్నారు. తొల‌గింపు నోటీసుకు వ్యతిరేకంగా తమ మద్దతు, నిరసన తెలియజేయడానికి విశ్వభారతి పూర్వ విద్యార్థి అయిన ఆర్థికవేత్తను ప‌లువురు విద్యార్థులు కలిశారు.

యూనిఫామ్ సివిల్ కోడ్..

యూసీసీ అనేది మతం, తెగ లేదా ఇతర స్థానిక ఆచారాలతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ వర్తించే వివాహం, విడాకులు, వారసత్వంపై ఒక ఉమ్మడి చట్టాలను సూచిస్తుంది. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ప్రజా, గుర్తింపు పొందిన మత సంస్థలతో సహా భాగస్వాముల అభిప్రాయాలను కోరడం ద్వారా లా కమిషన్ జూన్ 14న యూసీసీపై కొత్త సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్