LIC IPO: భారతదేశపు అతిపెద్ద IPO.. ఎల్ఐసీ ఐపీవో గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్‌-10 విష‌యాలు !

Published : May 03, 2022, 03:05 PM IST
LIC IPO: భారతదేశపు అతిపెద్ద IPO.. ఎల్ఐసీ ఐపీవో గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్‌-10 విష‌యాలు !

సారాంశం

Life Insurance Corporation: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) మే 4న ప్రారంభం కానుంది. మార్చి 9న ఐపీవో ఇష్యూ ముగియనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థలో ప్రభుత్వం 3.5% వాటాను విక్రయించనుంది.  

LIC IPO: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) కు స‌మ‌యం రానే వ‌చ్చింది.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. LIC మే 4న భారతదేశపు అతిపెద్ద IPOగా మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండగా.. కేంద్రం LIC IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కి ₹ 902 నుండి ₹ 949గా నిర్ణయించింది. LIC IPO విలువ ₹ 21,000 కోట్లు. పబ్లిక్ ఇష్యూ మొదట మే 2న పెట్టుబడిదారుల కోసం ప్రారంభించబడింది. ఇది మే 4 నుండి మే 9 వరకు సాధారణ ప్రజలకు బిడ్డింగ్ కోసం తెరిచి ఉంటుంది.

LIC IPO గురించి మీరు తెలుసుకోవలసిన టాప్ప్ర-10 విష‌యాలు ఇవిగో.. 

1. LIC IPO మొత్తం విలువ ₹ 21,000 కోట్లుగా నిర్ణయించారు. ఇది ఇప్పటి వరకు భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా మారింది.

2. ఉద్యోగుల కోసం దాదాపు 15.81 లక్షల షేర్లు, పాలసీదారుల కోసం దాదాపు 2.21 కోట్ల షేర్లు రిజర్వ్ చేయబడ్డాయి.

3. దరఖాస్తుదారులు లాట్లలో దరఖాస్తు చేసుకోగలరు. ఇక్కడ ఒక LIC IPO లాట్‌లో 15 LIC షేర్లు ఉంటాయి. ఒక దరఖాస్తుదారు కనీసం ఒకటి మరియు గరిష్టంగా 14 లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫలితంగా, LIC IPO కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన కనీస మొత్తం ₹ 14,235 (అంటే ₹ 949 x 15). 

4. మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్ర‌కారం.. LIC IPO గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) - IPO లిస్టింగ్ ప్రక్రియకు ముందు గ్రే మార్కెట్‌లో ట్రేడ్ చేయబడిన ధర  నిన్న ₹ 69 తో పోలిస్తే ఈరోజు ₹ 85గా ఉంది. 

5. పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునే పాలసీదారులకు ₹ 60 తగ్గింపు.. ఎల్‌ఐసి ఉద్యోగులకు ₹ 45 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది. 

6. ఎల్‌ఐసి పాలసీ హోల్డర్స్ రిజర్వేషన్ పోర్షన్ ఆఫర్ సైజులో 10 శాతం ఉంటుంది. అయితే ఉద్యోగులు పోస్ట్ ఆఫర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఐదు శాతం రిజర్వ్ చేయబడతారు.

7. IPO మార్చి 31 లోపు ప్రారంభించాలని భావించారు, అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య దారుణంగా మారిన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడింది.

8. LIC IPO యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ₹ 13,000 కోట్ల విలువైన పెట్టుబడి కట్టుబాట్లను పొందింది. అటువంటి పెట్టుబడిదారులకు అందించే షేర్ల విలువ కంటే రెండు రెట్లు ఎక్కువ. 

9. భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ బంపర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ముగిసిన వారం తర్వాత మే 17న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

10. అంత‌కు ముందు ప్ర‌భుత్వం 5 శాతం వాటాలు విక్రయిస్తామని మొదట డ్రాఫ్ట్ పేపర్స్‌లో వెల్లడించింది. అయితే, ప్ర‌స్తుతం వివ‌రాల ప్ర‌కారం ప్రభుత్వం ఎల్ఐసీ IPO పరిమాణాన్ని 1.5 శాతం లేదా దాదాపు 9.4 కోట్ల షేర్లను తగ్గించింది. ఎల్‌ఐసీ బోర్డు ఇష్యూ పరిమాణాన్ని 3.5 శాతంగా నిర్ణ‌యించింది. కేవలం 3.5 శాతం వాటాలను మాత్రమే అమ్మి రూ.21,000 కోట్లు (22.14 కోట్ల షేర్లు) సమీకరించాలని నిర్ణ‌యానికి వ‌చ్చింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు