అచ్చు సినిమానే: కడుపులో కొకైన్ తరలిస్తూ ఢిల్లీలో పట్టుబడిన విదేశీయుడు

By narsimha lodeFirst Published Oct 4, 2022, 10:56 AM IST
Highlights

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 9 కోట్ల విలువైన కొకైన్ ను దేశంలోకి రవాణా చేస్తున్న విదేశీయుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి కడుపు నుండి క్యాప్సూల్స్ రూపంలో ఉన్న కొకైన్ ను అధికారులు సీజ్ చేశారు. 

న్యూఢిల్లీ:ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 9 కోట్ల విలువైన కొకైన్ ను దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న లైబిరియాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన  అజర్ బైజాన్ నుండి అడిస్ అబాబా మీదుగా ఆ ప్రయాణీకుడు ఢిల్లీకి చేరుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగులు చెక్ చేశారు. కానీ ఏమీ లభ్యం కాలేదు.  కొన్ని క్యాప్యూల్స్ రూపంలో డ్రగ్స్ ను తరలిస్తున్న విషయాన్ని అతను కస్టమ్స్ అధికారులకు తెలిపారు.  దీంతో అతడి  పొట్ట నుండి 599 గ్రాముల వైట్ పౌడర్ ఉన్న క్యాప్యూల్స్ ను రికవరీ చేశారు. దీన్ని కొకైన్ గా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీని విలువ రూ. 9 కోట్లుగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. మరో ప్రయాణీకుడు  రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. అతని నుండి కూడ డ్రగ్స్ వెలికితీస్తున్నామని ఆ ప్రకటనలో కస్టమ్స్ అధికారులు తెలిపారు.

మరో రెండు కేసుల్లో రూ. 1.27 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం నాడు సీజ్ చేశారు. శనివారం నాడు బ్యాంకాక్ నుండి  వచ్చిన  ప్రయాణీకుడి నుండి  రెండు కిలోల బరువున్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.విమానాశ్రయ సిబ్బందికి బంగారం అప్పగించడం ద్వారా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణీకుడితో పాటు ఎయిర్ పోర్టులో బంగారం తీసుకొనేందుకు సిద్దంగా ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు ఆ ప్రకటనలో వివరించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 29న దుబాయి నుండి వచ్చిన విమానం  టాయిలెట్ సీటు  వెనుక ప్యానెల్ నుండి కస్టమ్స్ అధికారులు రూ. 41.35 లక్షల విలువైన 937 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

click me!