రాహుల్‌కు పెళ్లి చేసేద్దాం.. సోనియా గాంధీ చెవిలో వేసిన మహిళ.. సోనియా, రాహుల్ ఏమన్నారంటే?

Published : Jul 29, 2023, 05:28 PM IST
రాహుల్‌కు పెళ్లి చేసేద్దాం.. సోనియా గాంధీ చెవిలో వేసిన మహిళ.. సోనియా, రాహుల్ ఏమన్నారంటే?

సారాంశం

రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి వచ్చింది. ఈ సారి హర్యానా మహిళలు సోనియా గాంధీతో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ముందే.. ఆయనకు పెళ్లి చేసేయాలని సోనియా గాంధీకి ఆ మహిళ ప్రతిపాదించారు.  

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి పెళ్లి చేసేద్దాం! ఏమంటావ్?.. సోనియా గాంధీ చెవిలో మెల్లిగా హర్యానా మహిళ ప్రస్తావించింది. దానికి సోనియా గాంధీ వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చింది. రాహుల్ గాంధీ కూడా ఆ ప్రస్తావన విని మాట్లాడారు. అడిగిన ఆ మహిళ ఎవరు? సోనియా, రాహుల్ గాంధీలు ఏం సమాధానం చెప్పారు?

రాహుల్ గాంధీ కొన్ని వారాల క్రితం హఠాత్తుగా వరి పొలాల్లో కనిపించారు. రైతులతో కలిసి పొలం పనిలో భాగం పంచుకున్నారు. ఇలాగే.. ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ హర్యానా పర్యటించారు. సోనిపాట్ జిల్లాలోని మదీనా గ్రామంలో ఓ పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. మహిళా రైతులతోనూ ప్రత్యేకంగా సంభాషించారు. సోదరి ప్రియాంక గాంధీకి ఫోన్ కలిపి వారితో మాట్లాడించారు. అంతలోనూ ఢిల్లీ చూడాలనే ఆ మహిళల కోరికను తీరుస్తానని హామీ ఇచ్చి వచ్చేశారు. అనంతం, కొన్ని రోజుల తర్వాత వారిని ఢిల్లీ చూపించి 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి తీసుకెళ్లారు.

అక్కడ వారంతా డైనింగ్ టేబుల్‌లో ఆహారం తింటూ మాట్లాడుకున్నారు. పెరుగుతున్న ధరలు, సిలిండర్ ధరలు, టమాట ధరలు, నిరుద్యోగం వంటి విషయాలను ఆ మహిళలు చెప్పుకువచ్చారు. సోనియా గాంధీ గురించి, ప్రియాంక, రాహుల్ గాంధీల గురించీ ఆ మహిళలు అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ గాంధీ చనిపోయాక ఎలా సమయాన్ని ఎదుర్కొన్నారని సోనియా గాంధీని అడగ్గా ప్రియాంక గాంధీ వారికి సమాధానం ఇచ్చారు. రాహుల్, ప్రియాంకలలో ఎవరు అల్లరి చేసేవారని అడగ్గా.. రాహుల్ అని సమాధానం చెప్పారు. 

Also Read: కుక్కగా అవతారమెత్తిన జపాన్ వాసి, 20 వేల డాలర్లు ఖర్చు పెట్టి మరీ..!

అనంతరం, ఈ చర్చ జరుగుతుండగా సోనియా గాంధీ పక్కనే కూర్చున్న ఓ మహిళ రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. సోనియా గాంధీ చెవికి దగ్గరగా వెళ్లి.. రాహుల్ గాంధీ పెళ్లి చేసేద్దాం.. అని పేర్కొంది. దీనికి సమాధానంగా.. ముందు మీరు పిల్లను చూడండి అని సోనియా గాంధీ సమాధానం ఇచ్చారు. వెంటనే అందరూ నవ్వారు. రాహుల్ గాంధీ కూడా.. అయిపోతుందిలే అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu