అసోంలో చిరుత కలకలం, 13 మందికి గాయాలు, కంచెదూకి వచ్చి కలకలం..

By SumaBala BukkaFirst Published Dec 27, 2022, 2:02 PM IST
Highlights

అసోంలోని జోర్హాట్ లో ఓ చిరుత కలకలం రేపింది. అడవినుంచి కంచె దాటి జనావాసాల్లోకి దూసుకొచ్చింది. కనిపించిన వారి మీద దాడి చేస్తూ భయానక పరిస్థితులకు దారి తీసింది. 

జోర్హాట్ : అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి దాడిలో పిల్లలు, అటవీ అధికారులు సహా కనీసం 13 మంది గాయపడ్డారు.
జిల్లాలోని చెనిజాన్ ప్రాంతంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) క్యాంపస్‌లో తెల్లవారుజామున చిరుత హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. చిరుతపులి కనిపించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

క్యాంపస్‌లోని మహిళలు, పిల్లలతో సహా 10 మంది నివాసితులు, ముగ్గురు అటవీ సిబ్బందిపై గత 24 గంటల్లో పెద్దపులి దాడి చేసింది, తరువాత అదక్కడి నుండి పారిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, చిరుతపులి అక్కడి నుండి పారిపోయే ముందు ముళ్ల కంచెపై నుండి దూకడం, కార్ల మీదికి దూసుకెళ్లడం కనిపిస్తుంది. 

నాజల్ వ్యాక్సిన్ ధరలు వెల్లడించిన భారత్ బయోటెక్.. బూస్టర్ డోసుగా వచ్చే నెల నుంచి అందుబాటులోకి

చిరుతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నించామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పారిపోయిన చిరుతను ట్రాక్ చేసి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే చిరుత సంచారం వల్ల స్థానికులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

పెద్ద పిల్లి క్యాంపస్ చుట్టూ తిరుగుతున్న ఓ వీడియోను అటవీ అధికారులువిడుదల చేశారు. కోర్హాట్ శివార్లలో ఉన్న ఆర్ఎఫ్ఆర్ఐ చుట్టూ ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. చిరుతపులి అక్కడి నుండి క్యాంపస్‌లోకి వచ్చిందని భావిస్తున్నారు.
 

inside campus of RFRI, pic.twitter.com/3bQzhWDJK2

— Ibrahim (@Ibrahimrfr)
click me!