నాజల్ వ్యాక్సిన్ ధరలు వెల్లడించిన భారత్ బయోటెక్.. బూస్టర్ డోసుగా వచ్చే నెల నుంచి అందుబాటులోకి

By Mahesh KFirst Published Dec 27, 2022, 1:38 PM IST
Highlights

భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ ఇన్కోవ్యాక్ ధరలను వెల్లడించింది. ప్రైవేట్ హాస్పిటళ్లకు రూ. 800 (ట్యాక్స్ అదనం), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసుకు రూ. 325 చొప్పున అందిస్తామని తెలిపింది. ఈ డోసును 18 ఏళ్లు పైబడిన అర్హులైన వారికి బూస్టర్ డోసుగా వేస్తారు. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది.
 

హైదరాబాద్: భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ టీకా ధరలను వెల్లడించింది. ప్రైవేటు హాస్పిటళ్లకు రూ. 800 (ట్యాక్సులు అదనం)కు వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది. అదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బల్క్ కొనుగోళ్లకు డోసుకు రూ. 325 చొప్పున విక్రయిస్తామని వివరించింది. తాము తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. జనవరి నాలుగో వారంలో నాజల్ వ్యాక్సిన్ ఇన్కోవ్యాక్‌ను అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

ముక్కు ద్వారా వేసే ఈ ఇన్కోవ్యాక్ నాజల్ టీకాను 18 ఏళ్లు పైబడిన అర్హులైనవారికి బూస్టర్ డోసుగా అందిస్తారు.

ఈ నెలలోనే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాజల్ వ్యాక్సిన్‌నుహెటిరోలోగస్ బూస్టర్‌‌గా వినియోగించడానికి  కేంద్ర డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. హెటిరోలోగస్ బూస్టర్ సిస్టమ్‌లో ఫస్ట్, సెకండ్ డోసులు వేసుకున్న టీకాలకు భిన్నమైన టీకాను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చు.

Also Read: కొవాగ్జిన్‌కు ఆమోదంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.. ఆ మీడియా రిపోర్ట్స్‌ను ఖండించిన కేంద్రం..

ఈ టీకాను వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేసుకోవచ్చు. తద్వార స్టోరేజీ అయినా.. పంపిణీ అయినా సులభతరంగా చేయడానికి వీలవుతుందని వివరించింది.

click me!