సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి.. వైరల్ గా మారిన వీడియో..

By SumaBala BukkaFirst Published Mar 28, 2023, 10:07 AM IST
Highlights

ఓ చిరుత సూర్యనమస్కారం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ ను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ కు కనువిందు చేస్తారు. తాజాగా, సోషల్ మీడియాలో చిరుతపులికి సంబంధించిన మరో మనోహరమైన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో క్లిప్‌లో, చిరుతపులి నిద్రలేచిన తర్వాత వార్మప్ చేయడం కనిపిస్తుంది. 

ఉదయాన్నే.. శరీరాన్ని సాగదీయడం.. ముందు కాళ్లమీద ఒంగి..తల పైకెత్తి.. ఆ తరువాత వెనక కాళ్లను ముందు సాగదీసి బాడీని యాక్టివ్ చేసుకుంటుంది. అది ఆ పులి దినచర్యలో భాగమే కానీ.. చిరుతపులి ప్రముఖ యోగా భంగిమ సూర్య నమస్కారాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ "సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి" అని నందా తన పోస్ట్‌కి క్యాప్షన్‌లో రాశారు.

ఈ అన్నల ప్రేమ అమూల్యం.. చెల్లి పెళ్లిలో రూ.8కోట్ల విలువైన కానుకలు..

నందా సోమవారం ఈ వీడియో క్లిప్‌ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. అప్పటి నుండి ఈ వీడియోకు 124,000 కంటే ఎక్కువ వ్యూస్, 2,500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ చేస్తూ..భలే వీడియో అంటూ ఆనందపడుతున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ..  "ఈ యోగా మూవ్‌లను వారికి ఎవరు నేర్పిస్తారు? యోగా టీచర్ లేడు, యూట్యూబ్ లేదు, పుస్తకాలు లేవు" అని సరదాగా రాశారు. "ఫిట్‌నెస్ ఫ్రీక్ చిరుతపులి" అని మరొకరు చెప్పారు.

మూడో వ్యక్తి చిరుతపులి "ఫిట్‌నెస్ రహస్యం" అని వ్యాఖ్యానించగా, నాల్గో వ్యక్తి "వావ్! వాస్తవానికి ఇది అసలు సూర్య నమస్కారం" అని జోడించారు. ఇంకొకరు "నేను చాలా సేపటి తరువాత నన్ను చూస్తే.. నా కుక్కలు కూడా అలాగే చేస్తాయి.." అని ఒకరు రాశారు.

అడవి జంతువులు, వాటి కదలికలను ట్రాక్ చేయడానికి అమర్చిన రహస్య కెమెరా ద్వారా ఈ వీడియో రికార్డ్ చేయబడింది. దీన్ని మొదట ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆయన  తన పోస్ట్ క్యాప్షన్ లో ఈ చిన్న క్లిప్‌ను రష్యా, ఫార్-ఈస్ట్‌లోని 'ల్యాండ్ ఆఫ్ ది లెపార్డ్' నేషనల్ పార్క్‌లో చిత్రీకరించినట్లు తెలియజేశాడు. 

ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో ఆసక్తికరమైన వన్యప్రాణుల కంటెంట్‌ను పంచుకోవడంలో బాగా పేరు పొందారు. గత వారం, అతను గుజరాత్‌లో సింహాన్ని కుక్కలు తరిమికొట్టిన వీడియోను షేర్ చేశాడు. క్లిప్‌లో, సింహం గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కనిపించింది, కుక్కల గుంపు ఆ అడవి జంతువును తరిమికొట్టింది.

 

Surya Namaskar by the leopard 👌👌
Via ⁦⁩ pic.twitter.com/jklZqEeo89

— Susanta Nanda (@susantananda3)
click me!