కంటి సమస్యలను కనిపెట్టే సింగిల్ యాప్... 11ఏళ్ల బాలిక సృష్టి..!

By telugu news teamFirst Published Mar 28, 2023, 9:46 AM IST
Highlights

లీనా, ఓగ్లర్ ఐస్కాన్ అనే AI ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆమె 10 సంవత్సరాల వయస్సులో ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. మొబైల్ యాప్ ప్రత్యేకమైన స్కానింగ్ ప్రక్రియ ద్వారా వివిధ కంటి వ్యాధులు , పరిస్థితులను గుర్తించగలదు.
 


11ఏళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు..? రోజూ స్కూల్ కి వెళ్లామా..., హోం వర్క్లు రాశామా, టీవీలు చూశామా, గేమ్స్ ఆడామా.. ఇదే రోటీన్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అలాకాదు.... కంటి సమస్యలను గుర్తించే ఓ యాప్ ని కనిపెట్టింది. ఇంతకీ ఎవరా అమ్మాయి..? ఆ యాప్ విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం...

కొంతకాలం క్రితం.. అతి చిన్న వయసులో  iOS డెవలపర్‌గా  హనా రఫీక్ అనే 9 ఏళ్ల అమ్మాయి నిలిచింది. ఆమెకు అప్పుడు.. Apple CEO టిమ్ కుక్ నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆమె సోదరి లీనా రఫీక్ ఈ కంటి సమస్యలను గుర్తించే యాప్ కనిపెట్టడం విశేషం. దుబాయి కి చెందిన భారతీయ బాలిక లీనా రఫిక్... కంటి వ్యాధులు, పరిస్థితులను గుర్తించడానికి AI- ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. 

 లీనా, ఓగ్లర్ ఐస్కాన్ అనే AI ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆమె 10 సంవత్సరాల వయస్సులో ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. మొబైల్ యాప్ ప్రత్యేకమైన స్కానింగ్ ప్రక్రియ ద్వారా వివిధ కంటి వ్యాధులు , పరిస్థితులను గుర్తించగలదు.

సంభావ్య కంటి వ్యాధులు లేదా ఆర్కస్, మెలనోమా, టెరీజియం , కంటిశుక్లం వంటి పరిస్థితులను నిర్ధారించడానికి ఓగ్లర్ శిక్షణ పొందిన నమూనాలను ఉపయోగిస్తారు. ఈ విషయాన్ని బాలిక.. లింక్డిన్ లో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

 

‘‘ Ogler EyeScan పేరుతో నా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మొబైల్ యాప్‌ను తయారు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను 10 సంవత్సరాల వయస్సులో ఈ Ai యాప్‌ని సృష్టించాను. Ogler ప్రత్యేక స్కానింగ్ ప్రక్రియ ద్వారా వివిధ కంటి వ్యాధులు,  పరిస్థితులను గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ’’ అని తన పోస్టులో పేర్కొంది. ఇంకా.. ఆ యాప్ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఆమె అందులో వివరించడం విశేషం.

రకరకాల పద్దతుల్లో అడ్వాన్సడ్ కంప్యూటర్ విజయన్ అండ్ మెషిన్ లెర్నింగ్ తో కంటికి సంబంధించే పలు సమస్యలను గుర్తించినట్లు బాలిక తెలిపింది. దీంతో పాటు స్కానర్ ఫ్రేమ్ తో కంటి వెలుతురు సమస్యలను గుర్తించవచ్చని చెప్పింది. స్కాన్ తీసిన తర్వాత కంటి వ్యాధులు ఆర్కస్, మెలనోమా, పేటరీజియం, కంటి శుక్లం వంటి సమస్యలను గుర్తించగలదట. ఈ యాప్ ఐఫోన్10, అంతకంటే ఎక్కువ ఐఓఎస్ 16 తో మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పింది. కాగా... ఆ బాలిక పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

click me!